శ్రీశైలం ఘాట్ రోడ్డులో పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైల దేవస్థానానికి 10 కిలో మీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో చిన్నారుట్ల వద్ద పులి సంచరించింది. దీనితోభక్తులు భయాందోళనకు గురయ్యారు. 20 నిమిషాల పాటు రోడ్డుకు అడ్డంగా కూర్చుండటం తో భక్తుల వాహనాలు అపి పులినిఆసక్తి గా చూసారు.
ఈ సందర్భంగా 20 నిమిషాలు పాటు ట్రాఫిక్ జామ్ కావడం తో భక్తులు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. కాసేపటి తరువాత పులి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లడం తో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.