28.7 C
Hyderabad
April 28, 2024 05: 43 AM
Slider జాతీయం

డేంజర్ పోలీస్: రాష్ట్రపతి శౌర్యపురస్కారం ఉగ్రవాదులకు సహకారం

terror police

ఉగ్రవాదులకుసహాయం చేస్తూ పట్టుబడ్డ ఒక పోలీస్ అధికారి ఉదంతం ఇది. పైగా అతను మామూలు అధికారి కాదు రాష్ట్రపతి నుంచి శౌర్య పురస్కారం అందుకుని పలువురి ప్రశాంసలు పొందినవాడు కావడం విమర్శలకు తావిస్తుంది.శ్రీనగర్‌ విమానాశ్రయంలో యాంటీ హైజాకింగ్ యూనిట్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న దవీందర్ సింగ్‌ ఉగ్రవాదులతో కలిసి కారులో ప్రయాణిస్తూ పట్టుబడ్డాడు.

శ్రీనగర్‌లోని జమ్మూ కశ్మీర్ నేషనల్ హైవేపై ఉన్న చెక్‌ పాయింట్ వద్ద వీరిని అరెస్టు చేశారు. గతేడాది దవీందర్ సింగ్‌ రాష్ట్రపతి నుంచి శౌర్య పురస్కారం అందుకున్నారు.జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులను సమీక్షించేందుకు 15 మంది సభ్యులతో కూడిన విదేశీ రాయబారుల బృందం శ్రీనగర్ కు చేరుకోగా విమానాశ్రయంలో వారిని రిసీవ్ చేసుకున్నవారిలో దవీందర్ సింగ్ కూడా న్నారు. దవీందర్ హిబ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులతో కలిసి ఓ ప్రైవేట్ వాహనంలో ప్రయాణించారని పోలీసులు గుర్తించారు.

ఆ వాహనం లో హిజ్బుల్ కమాండర్ సయ్యద్ నవీద్ ముస్తాక్‌, బత్పోరా నివాసి అయిన రఫి రథర్‌లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రఫి రథర్ గతేడాది ఉగ్రవాదులతో చేరిపోగా ఇర్ఫార్ షఫి అనే లాయర్ ఈ వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐ10 కారులో షోపియన్ నుంచి జమ్మూ శ్రీనగర్ హైవేపై వస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్పీ ఐజీ విజయ్ కుమార్‌ సౌత్ కశ్మీర్ డీఐజీని చెక్ పాయింట్లలలో అలెర్ట్ గా ఉండాలని ఆదేశించారు.

వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఇద్దరు ఉగ్రవాదులతో డావిందర్ సింగ్ అందులో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు విజయ్ కుమార్ వెల్లడించారు. ఒక సీనియర్ ఆఫీసరుగా ఉండి ఇలాంటి దేశద్రోహ చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమని ఉగ్రవాదుల వేటకోసం జరిగిన పలు ఆపరేషన్లలో కూడా దవేందర్ సింగ్ పాల్గొన్నారని అలాంటి అధికారి ఇలా ఎందుకు చేసాడో విచారణ జరుపుతున్నామని అయన తెలిపారు.దవేందర్‌ సింగ్‌ను కూడా ఇప్పుడు ఉగ్రవాదిలానే చూస్తున్నామని అన్నారు .

Related posts

జర్నలిస్టులపై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Satyam NEWS

పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు

Murali Krishna

తొలకరి

Satyam NEWS

Leave a Comment