30.7 C
Hyderabad
May 5, 2024 03: 22 AM
Slider హైదరాబాద్

బేకరీ తెరిచి ఉన్నా పట్టించుకోని పోలీసులు

#Shiraton Bakers

లాక్ డౌన్ సందర్భంగా అన్ని వ్యాపార వాణిజ్య వర్తక కేంద్రాలూ మూతపడ్డాయి. నిత్యావసరాలకు సంబంధించిన షాపులు మాత్రం నిర్ణీత వేళల్లో తెరుస్తున్నారు. అయితే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అంబర్ పేట్ ఛే నెంబర్ బస్టాప్ వద్ద ఉన్న షరటన్ బేకరీ మాత్రం ఎల్లవేళలా తెరిచే ఉంటున్నది.  

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించడం లేదు. లాక్ డౌన్ సం దర్భంగా హైదరాబాదులోని అన్ని బేకరీలు మూతపడ్డాయి. అయితే గత కొద్ది రోజులుగా షరటన్ బేకరీ మాత్రం కేక్ లు, బిస్కెట్ల విక్రయాలు మాత్రం యథావిధిగా చేసేస్తున్నది. ఛే నెంబర్ చెక్ పోస్ట్ ఎదురుగా ఉన్న ఈ బేకరీ లో కేకులు, బిస్కెట్ల విక్రయాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోక పోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఈ బేకరీ లో సాయంత్రం టీ అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. సామాన్యుడు ఫ్లాస్క్ లో చాయ్ తీసుకొని రోడ్లపై తిరుగుతూ అమ్ముకుంటే పట్టుకొని కేసులు నమోదు చేస్తున్న అంబర్ పేట పోలీసులు ఈ బేకరీ వైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి లాక్ డౌన్ నిబంధనలు అందరికీ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

జూన్,జూలై నెలల్లో సమరశీల పోరాటాలు

Bhavani

గుడ్ కాజ్: బిచ్కుంద లో వాటరింగ్ డే

Satyam NEWS

256 మంది టిడ్కో బాధితుల మొర ఆలకించండి..!

Bhavani

Leave a Comment