27.7 C
Hyderabad
May 4, 2024 07: 57 AM
Slider జాతీయం

ఎక్కువ జీతం తీసుకునేది బెంగళూరు ఐటి నిపుణులే

ransted

అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఐటి నిపుణులు ఎక్కువ ఉన్న సిటీగా బెంగళూరు అంతర్జాతీయంగా పేరు సాధించింది. నెదర్లాండ్స్ కు చెందిన మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థ రాండ్‌స్టాడ్ ఇటీవల చేసిన జీవన శైలి సర్వేలో ఈ విషయం వెల్లడైంది. బెంగుళూరు దేశంలో అత్యధికంగా ఐటీ ఉద్యోగులున్న నగరాల్లో ఒకటి.

ఈ నివేదిక ప్రకారం జూనియర్ స్థాయి ప్రతిభావంతుల కోసం బెంగళూరులో కంపెనీలు అందించే సగటు వార్షిక వేతనం (సిటిసి) రూ.5.27 లక్షలు, మధ్య స్థాయికి రూ.16 16.45 లక్షలు, సీనియర్ స్థాయికి రూ.35.45 లక్షలు. 2017, 2018 సంవత్సరాల జీతాల నివేదికలలో బెంగళూరు మొదటి స్థానంలోనే ఉంది. అదే విధంగా జూనియర్ స్థాయి ఉద్యోగులకు జీతాలు హైదరాబాద్ (రూ.5 లక్షలు), ముంబై (రూ.4.59 లక్షలు) లో ఉన్నాయి.

మధ్యతరగతి జీతాలు ముంబై (రూ.15.07 లక్షలు), ఢిల్లీ (రూ.14.5 లక్షలు) లో ఉన్నాయి. సీనియర్‌లకు ముంబైలో రూ.23.95 లక్షలు, పూణేలో రూ.32.68 లక్షలు జీతం లభిస్తుంది. ఐటి తర్వాత జీఎస్టీ నిపుణులకు దేశంలో భారీ డిమాండ్ కనిపిస్తున్నది. ఆ తర్వాతి జాబితాలో అకౌంటెంట్లు, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్, న్యాయవాదులకు డిమాండ్ పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది.

Related posts

ఆత్మ గౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ;మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు టీడీపీ నివాళి

Satyam NEWS

వెలుగులు విరజిమ్మనున్న వెంకటగిరి

Bhavani

Leave a Comment