ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఐసిస్ తన వికృత రూపాన్ని మరో సారి ప్రపంచానికి చూపించింది. ఈశాన్య నైజీరీయాలో బందీలుగా ఉన్న 11 మందిని అత్యంత దారుణంగా హతమార్చింది. ఐఎస్ అధినేత అబూబాకర్ ఆల్ బాగ్దాది మరణానికి ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడినట్లు ప్రకటించింది. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)తో జట్టుకట్టిన నైజీరియా జీహాదీలు ఈశాన్య నైజీరియా నుంచి ఇటీవల పదకొండు మంది క్రిస్టియన్లను బందీలుగా పట్టుకున్నారు.
ఇస్లామిక్ స్టేట్ పశ్చిమాఫ్రికా ప్రావిన్స్ (ఐఎస్‌డబ్ల్యూఏపీ) జీహాదీలు వీరి కళ్లకు గంతలు కట్టి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకు వెళ్లారు. అక్కడ పది మంది తలలు నరికేశారు. మరొకరిని కాల్చిచంపారు. అనంతరం ‘మేము బందీలుగా పట్టుకున్న 11 మందిని చంపేశాం’ అంటూ ఐఎస్ ప్రచార విభాగమైన అమక్ ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది.