కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గోపన్పల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా వైకుంఠధామం నిర్మాణానికి ఎంపిపి అశోక్ పటేల్ శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం నిర్మించడానికి ఉపాధి హమి నిధులు కేటాయించారని ఆయన తెలిపారు.
అందువల్ల వైకుంఠ ధామాల నిర్మాణానికి సర్పంచ్ లు ప్రత్యేక దృష్టి సారించి త్వరగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపితో పాటు సర్పంచ్ శ్రీనివాస్ ఎంపీటీసీ సుజాత రాములు, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి ఆరెస్సెస్ అధ్యక్షులు బస్వ రాజ్ పటేల్ .పార్టీ గ్రామ అధ్యక్షులు రాములు నాయకులు నాగ్నాథ్ సాయిలు ఉపాధిహామీ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.