33.7 C
Hyderabad
April 29, 2024 02: 16 AM
Slider నిజామాబాద్

అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు ఆరోగ్య రక్షణ కల్పించాలి

#Health Workers

బిచ్కుంద మండలంలో కరొనా వైరస్ నేపథ్యంలో గత 50 రోజుల నుండి తమ ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా కరొనా నివారణకు ముందుభాగాన నిలబడి విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ, ఆశ కార్యకర్తలoదరికి ప్రభుత్వం రక్షణ పరికరాలు అందజేయాలని  జుక్కల్ నియోజకవర్గం సి ఐ టి యు కన్వీనర్ సురేష్ గొండ డిమాండ్ చేశారు.

సి ఐ టి యు కేంద్ర కమిటి పిలుపు మేరకు గురువారం నియోజకవర్గం లోని జుక్కల్, బిచ్కుంద, మండలాల్లో అంగన్వాడీ, ఆశ కార్యకర్తల ఇంటి ముందు ప్లే కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా అంగన్వాడీ  మద్నూర్ ప్రాజెక్ట్ యూనియన్ అధ్యక్షురాలు చంప బాయి, కార్యదర్శి ఆర్, అనసూయ లు మాట్లాడుతూ కరొనా వైరస్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న ప్రతి అంగన్వాడీ, ఆశ కార్యకర్తలందరికీ ఆరోగ్య భీమా సౌకర్యం వర్తింపచేస్తూ అదనపు పారితోషికం 25వేలు చెల్లించాలని అంగన్వాడీ టీచర్లకు రెండు నెలల బకాయి వేతనాలు చెల్లించాలన్నారు.

వీటితోపాటు ఇప్పటివరకు పరిష్కారం కాని సమస్యలు వెంటనే పరిష్కరిస్తూ డ్యూటీలో ఉన్న వారందరికీ ఉచితంగా కోవిద్ 19పరీక్షలు నిర్వహించాలన్నారు. విధులలో భాగంగా మరణించిన వారి కుటుంబలకు 50లక్షల భీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం, నిత్యావసర సరకులను అందించాలన్నారు. కార్యక్రమం లో విజయ సుధాకర్, జె. హన్మవ్వ,ఆయా గ్రామాల అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

సంచలనం సృష్టించిన చదలవాడ కృష్ణమూర్తి అత్తగారి కిడ్నాప్

Satyam NEWS

రైస్ మిల్ కార్మికులకు పది రోజులు సెలవు ప్రకటించాలి

Satyam NEWS

పండుగలా ఉత్సవాలు

Bhavani

Leave a Comment