కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గోపన్పల్లి గ్రామంలో ఓ బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన ఇరవై నాలుగువేల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి ఎంపీపీ అశోక్ పటేల్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలన్నదే కెసిఆర్ స్వప్నమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపితో పాటు సర్పంచ్ శ్రీనివాస్ ఎంపీటీసీ సుజాత రాములు టీఆర్ఎస్ అధ్యక్షులు వెంకట్ దేశాయి. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, పార్టీ గ్రామ అధ్యక్షులు రాములు నాయకులు సాయిలు నాగ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.