29.7 C
Hyderabad
May 7, 2024 03: 15 AM
Slider తెలంగాణ

వచ్చే నెల 8వ తేదీన బి.సి. లిటరరీ ఫెస్టివల్-2019

allam narayana

వచ్చే నెల 8వ తేదీన బి.సి. రైటర్స్ వింగ్ ఆధ్వర్యంలో బి.సి. లిటరరీ ఫెస్టివల్-2019ను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్  అల్లం నారాయణ తెలిపారు. బుధవారంనాడు సమాచార భవన్ లో గల మీడియా అకాడమీ కార్యాలయంలో బి.సి. లిటరరీ ఫెస్టివల్ పోస్టర్ ను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలో బి.సి. కులాలు ప్రముఖ పాత్ర పోషించాయని అన్నారు.

బహుజన ఉద్యమాలు విస్తరించడానికి బి.సి.లు కీలకంగా వ్యవహరించారని తెలిపారు. బి.సి. సాహిత్యంలో అనేక ప్రక్రియలు స్థిరపడ్డాయని, బి.సి.లు అనేక ఉద్యమాలకు ఊపిరులు ఊదారని ఆయన వివరించారు. బి.సి. లిటరరీ ఫెస్టివల్ మొదటి సదస్సు వరంగల్-2017లో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఈ దఫా రెండవ సదస్సును హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో, డిసెంబర్, 8వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు.

బి.సి. రైటర్స్ వింగ్ వ్యవస్థాప అధ్యక్షులు డా. చింతం ప్రవీణ్  కుమార్ మాట్లాడుతూ,  బి.సి. రైటర్స్ వింగ్ ఆధ్వర్యంలో  బి.సి. కులాలలో సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలలో విశేష కృషికిగాను లబ్దప్రతిష్టులైన అయిదుగురికి బి.సి. రైటర్స్ వింగ్ విశిష్ట పురస్కార అవార్డ్-2019లను అందిస్తున్నామని తెలిపారు.

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు ఛత్రపతి సాహు మహారాజ్ సామాజిక పురస్కారం, ఆర్. కృష్ణయ్యకు బి.సి. రైటర్స్ వింగ్ జీవిత సాఫల్య పురస్కారం, అనిశెట్టి రజితకు బి.సి. రైటర్స్ వింగ్ స్టేట్ లిటరరీ అవార్డు, సంగిశెట్టి శ్రీనివాస్ కు మహాత్మా జ్యోతిబా పూలే సాంస్కృతిక పురస్కారం, అర్చన నుగూరికి సావిత్రీ భాయి పూలే క్రాంతి జ్యోతి పురస్కారం అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో  బి.సి. కమీషన్ సభ్యులు జూలూరి గౌరి శంకర్, మీడియా అకాడమీ కార్యదర్శి విజయ్ గోపాల్, ప్రముఖ రచయిత డా. కాలువ మల్లయ్య, ప్రముఖ బహుజన మేధావి డా. జిలుకర శ్రీనివాస్, ఎం.బి.సి. సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెక్కం వెంకట్, ఎమ్.ఎస్. ఫౌండేషన్ అధ్యక్షులు  ఎం. సత్యనారాయణ, రమణ కుమార్, చింతం గిరి, గురుచరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గార్లలో సిపిఎం కార్యకర్తల రాస్తారోకో

Bhavani

రోడ్డు ప్రమాదంలో పోలీసులు ఇన్ స్పెక్టర్ మృతి

Satyam NEWS

విషాదం : మరణించిన ఆలయ ఉద్యోగి శివ తల్లి గుండెపోటు తో మృతి

Satyam NEWS

Leave a Comment