26.7 C
Hyderabad
May 3, 2024 09: 37 AM
Slider జాతీయం

గోవాలో పాగా కోసం బెంగాల్ సీఎం మమతా ఎత్తులు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గోవాలో పర్యటిస్తున్నారు. పర్యటన సందర్భంగా మమతా బెనర్జీ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. గోవా పర్యటనలో మమతా బెనర్జీ మూడు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో ఒక సభ దక్షిణ గోవాలో జరగనుండగా, రెండు సమావేశాలు ఉత్తర గోవాలో జరగనున్నాయి.

ఫిబ్రవరిలో జరగనున్న గోవా ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పర్యటనలో ఆమె పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు బహిరంగ సభల్లో కూడా ప్రసంగించనున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ ఐదు వాగ్దానాలను ప్లాన్ చేసింది. తాము అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది.

ఈ పథకం కింద గోవా మహిళలు నెలకు రూ. 5,000 అందిస్తామన్నారు. తృణమూల్ వాగ్దానం ప్రకారం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలోని మహిళలకు డబ్బులు ఇచ్చేలా తృణమూల్ ఏర్పాట్లు చేస్తోంది.

Related posts

న్యూ డైమన్షన్: ఇదేమి ట్విస్టు సోదరా?

Satyam NEWS

టీఆర్ఎస్ నేతలకే నష్టపరిహారం.. లభించిన సాక్ష్యం..

Sub Editor

లే ఆఫ్ కష్టాలు: అగ్ర రాజ్యంలో నిరుద్యోగ కల్లోలం

Satyam NEWS

Leave a Comment