42.2 C
Hyderabad
May 3, 2024 17: 14 PM
Slider ప్రత్యేకం

ఈ-శిక్షణతో మెరుగుపడనున్న కాని స్టేబుళ్ళ కంప్యూటరు పరిజ్ఞానం

#deepikaips

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ-శిక్షణ కేంద్రంలో రెండు వారాల మొదటి బ్యాచ్ ఈ  – శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ – జిల్లాలో వివిధ పోలీసు స్టేషనులలో కంప్యూటరు, ఇంగ్లీష్ పరిజ్ఞానం కలిగిన పోలీసు కాని స్టేబుళ్ళు కొరత ఈ-శిక్షణతో తీరనున్నదన్నారు. ఈ-శిక్షణ పొందిన తరువాత కానిస్టేబుళ్ళు పని తీరులో వచ్చిన మార్పును, శిక్షణ పొందక ముందు వారి పని తీరును జిల్లా ఎస్పీ పరిశీలించారు. శిక్షణ కాలంలో వారు నేర్చుకున్న విషయాలను అడిగి తెలుసుకొన్నారు.

ఇక పై ఈ-శిక్షణ పొందబోయే కాని స్టేబుళ్ళుకు ఉపయుక్తంగా ఉండే విధంగా శిక్షణలో కొన్ని మార్పులు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. శిక్షణ అనంతరం, కానిస్టేబుళ్ళులో కంప్యూటరు, ఇంగ్లీష్ పరిజ్ఞానం మెరుగుపడినట్లు, ఇది పోలీసు స్టేషనులో నమోదైన వివిధ కేసుల దర్యాప్తును స్వంతంగా కేసు డైరీలను తయారు చేసేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

శిక్షణ పొందిన కానిస్టేబుళ్ళ సేవలను పోలీసు స్టేషనుల్లో వినియోగించుకోవాలని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. శిక్షణ పొందిన కాని స్టేబుళ్ళు అందించిన సేవలను, పనితీరును పరిశీలించి, వారికి అదనంగా కొంత అలవెన్సును కూడా మంజూరు చేసి, ప్రోత్సహిస్తామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక అన్నారు.

ప్రతిభ కనబర్చిన రామభద్రపురం కానిస్టేబుల్ వి. సీతారాం, జామి కానిస్టేబులు సిహెచ్. మురళీ మోహన్, విజయనగరం వన్ టౌన్ మహిళా కానిస్టేబుల్ జి.ధనలక్ష్మిలను జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, డీసీఆర్బీ సీఐ డా.బి.వెంకటరావు, ఎస్బీ సిఐ జి.రాంబాబు ,వన్ టౌన్ సీఐ జె.మురళి, ఎస్ ఐలు తారకేశ్వరరావు, కృష్ణవర్మ, దినకర్ మరియు ఇతర పోలీసు అధికారులు, ఈ-శిక్షణ పొందిన కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.

Related posts

ప్రతి దరఖాస్తును పరిశీలించాలి

Bhavani

రోల్ మోడల్ పాత్ర పోషిస్తున్న హోంగార్డులు

Murali Krishna

రాష్ట్ర అధ్యక్షుడు… అడిగితే పార్టీ పరిస్థితి పై చెప్పా…!

Satyam NEWS

Leave a Comment