33.2 C
Hyderabad
May 4, 2024 02: 05 AM
Slider విజయనగరం

సైబరు మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి

#cybercrimes

విశాఖ, రాజమండ్రి, విజయవాడ ,తిరుపతి, కర్నూలు మెట్రో పాలిటన్ నగరాలుగా రూపుదిద్దుకోబోతున్నాయి. ప్రధానంగా ఇలాంటి మహానగరాలలో తరచూ సైబర్ నేరాలు జరుగుతుంటాయి. ఆ మాదిరిగానే మిగిలిన నగరాల్లో కూడా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఎన్.సీ.ఆర్.బీ నివేదిక చెబుతున్నాయి. ఈ క్రమంలోనే విజయనగరం పోలీసులు సైబర్ నేరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ దీపికా ఆదేశాల మేరకు డీఎస్పీ గోవింద రావు సూచనలతో వన్ టౌన్ పోలీసులు రంగంలో కి దిగారు.

ఈ మేరకు విజయనగరం  ఉడా కాలనీలోని ప్రజలకు సైబరు మోసాలు, చిట్టీలు, దొంగతనాలు పట్ల వన్ టౌన్ పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ డా. బి.వెంకటరావు మాట్లాడుతూ మొబైల్స్ కు వచ్చే లింకులు, కే.వై.సి. అప్డేట్ పేరుతో వచ్చే మెసేజ్ లు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబరు మోసాలకు పాల్పడే మోసగాళ్ళు బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్మును కాజేసేందుకు అనేక రకాలుగా మెసేజ్ లు, వాట్సాప్ సందేశాలు, ఈ మెయిల్స్ పంపుతారని, అటువంటి వారికి ఎవ్వరూ స్పందించ వద్దన్నారు.

బ్యాంకు ఖాతాలు, ఆధార్ అప్డేట్ పేరుతో ఫోనులు చేసి, ఓటీపీ  చెప్పమని కోరుతారని, అటువంటి కాల్స్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని నంబర్ల నుండి వచ్చే లింకులు, మెసేజ్ లకు స్పందించ వద్దన్నారు. ఇటువంటి వాటికి పొరపాటున స్పందిస్తే, మన బ్యాంకు ఖాతాల్లో సొమ్ము ఖాళీ అయ్యే ప్రమాదముందన్నారు. ఇటువంటి తరహా మోసాలకు సైబరు మోసగాళ్ళు పాల్పడేందుకు అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

అంతేకాకుండా, ఎక్కువ వడ్డీలు ఆశతో చీటీలు వేసే వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇల్లు విడిచి దూర ప్రాంతాలకు వెళ్లే ముందు స్థానిక పోలీసు స్టేషనుకు ముందుగా సమాచారం అందిస్తే, ఆయా ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. దొంగతనాల నియంత్రణకు పోలీసుశాఖ రాత్రి గస్తీ, పెట్రోలింగ్ ముమ్మరం చేశామన్నారు. అయినప్పటికీ, అపార్టుమెంట్లు, వ్యాపార సంస్థలు, ఇండ్ల వద్ద సిసి కెమెరాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సీఐ డా. వెంకటరావు సూచించారు. ఈ కార్యక్రమంలో వెన్నతో ఎస్ఐ వి.అశోక్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

థ‌ర్డ్ వేవ్ సంకేతాల నేప‌ధ్యంలో అలెర్ట్ అయిన కొత్త ఎస్పీ దీపికా పాఠిల్….!

Satyam NEWS

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు

Satyam NEWS

గౌతంపూర్‌కు జాతీయ పురస్కారం పట్ల అభినందనలు

Satyam NEWS

Leave a Comment