28.2 C
Hyderabad
May 9, 2024 01: 59 AM
Slider ఖమ్మం

సెప్టెంబర్ 1 నుండి ఖమ్మం లో అగ్నివీర్ ర్యాలీ

#Khammam

అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలి 2023-24 ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తునట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ కీట్స్ కె దాస్ తెలిపారు. ఈ పరీక్ష రెండు దశలలో జరుగుతుందని, మొదటి దశ లో రాత పరీక్ష, ఇందులో ఉత్తీర్ణులైన వారికీ రెండవ దశ లో శారీరక సామర్ధ్యం , వైద్య పరీక్షలు జరుగుతాయని తెలిపారు. రాత పరీక్ష ఇప్పటికే పూర్తి అయ్యిందని, 7397 మంది ఈ ఆన్లైన్ పరీక్ష లో ఎంపికైనారని, వీరికి శారీరక, వైద్య పరీక్షలు సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతుందని అన్నారు.

డిపిఆర్సీ భవనంలో కల్నల్ కీట్స్ కె దాస్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ లతో సమావేశమై ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అవసరమగు గ్రౌండ్, భద్రత, ఫైర్ ఫిట్టింగ్ , ట్రాన్స్పోర్ట్, త్రాగు నీరు, సిసి కెమెరాలు, తదితర మౌళిక వసతుల కల్పనకు, ఇతర లాజిస్టిక్స్ ను ఏర్పాటు చేయాలనీ కోరారు. అనంతరం కలెక్టర్, పోలీస్ కమీషనర్లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి మాట్లాడుతూ, 1 సెప్టెంబర్ నుండి 7 సెప్టెంబర్ వరకు అగ్నివీర్ ర్యాలీ చేపడతామని అన్నారు. అభ్యర్థుల అడ్మిట్ కార్డు లోనే హాజరు తేదీ, సమయం పొందుపర్చామన్నారు. మాండేటరీ డాక్యుమెంట్లు లేనిది అనుమతించేది లేదని ఆయన అన్నారు. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీలో 1.6 కిమీ. రన్నింగ్, ఫుల్ అప్స్, 8 ఫీట్ డిక్, జిగ్ జాగ్, ఎత్తు, బరువు, ఛాతీ, డాక్యుమెంట్లు, వైద్య పరీక్షలు ఉంటాయన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, అగ్నివీర్ ర్యాలీ కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి 7 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని అన్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్స్ లో సూచించిన తేదీ, సమయానికి హాజరవ్వాలన్నారు. అడ్మిట్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, విద్యార్హతల సర్టిఫికెట్లు ఒరిజినల్ తో పాటు, 2 జిరాక్స్ కాపీలు, అఫిడవిట్, స్థానికత/నివాస, కమ్యూనిటీ/కుల, రిలీజియన్, క్యారెక్టర్,

అన్ మ్యారీడ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పోలీస్ వేరిఫికేషన్, ట్రైబల్ ధృవీకరణలు మాండేటరీ అని, వీటిని తప్పనిసరిగా వెంట తేవాలన్నారు. ఎటువంటి పైరవీలకు తావులేదని, పూర్తి పారదర్శకంగా, మెరిట్, ఫిజికల్ స్టాండర్డ్ ప్రకారం రిక్రూట్మెంట్ జరుగుతుందని ఆయన తెలిపారు. మధ్యవర్తుల చేతిలో మోసపోవద్దని కలెక్టర్ అన్నారు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా జిల్లా యంత్రాంగం నుండి రిక్రూట్మెంట్ ర్యాలికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, అగ్నివీర్ ర్యాలీ రాష్ట్రంలో మొదటగా సూర్యాపేట లో జరగగా, రెండోసారి మన ఖమ్మం జిల్లాలో జరుగనున్నట్లు తెలిపారు. మన ప్రాంత యువతకు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మాండేటరీ డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లారన్నారు.

మధ్యవర్తులని నమ్మి మోసపోవద్దని, ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఈవెంట్లలో పాస్ చేయిస్తామని ప్రలోభపెడితే, వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని, ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మెరిటోరియస్ అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పోలీస్ కమీషనర్ అన్నారు.

Related posts

నాగర్ కర్నూల్ పట్టణంలో ఒక మహిళకు కరోనా

Satyam NEWS

రాక్షసానందం పొందుతున్న సోషల్ మీడియా

Satyam NEWS

(Free|Sample) Hoodia Diet Weight Loss Pill Successful Weight Loss Pills

Bhavani

Leave a Comment