33.7 C
Hyderabad
April 29, 2024 02: 25 AM
Slider ముఖ్యంశాలు

గౌతంపూర్‌కు జాతీయ పురస్కారం పట్ల అభినందనలు

#gowtampur

ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఎంపికైన చుంచుపల్లి మండలం గౌతంపూర్‌ గ్రామ పంచాయతీకి ఉత్తమ పంచాయతీగా జాతీయ స్థాయిలో పురస్కారం లభించిడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో  జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్పంచ్‌ పొడియం సుజాత అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్, జెడ్పీ సీఈఓ విద్యాలత, డీపీవో రమాకాంత్, సర్పంచ్  సుజాత, పంచాయతీ కార్యదర్శి షర్మిల, ఎంపీవో సత్యనారాయణ, ఖమ్మం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి శాలువాకప్పి సత్కరించారు.ఇలాంటి అరుదైన గౌరవం భద్రాద్రి జిల్లాకు దక్కడం ఇది రెండోసారి అని, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ సారథ్యంలో గతంలో స్వచ్ఛ గ్రామీణ్‌కు జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు రావడంతో జిల్లాకు గర్వకారణం అన్నారు.

 తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు, జరుగుతున్న అభివృద్ధి దేశానికి గీటురాయిగా నిలవడంలంటిదన్నారు. ఉత్తమ పంచాయతీలో ఆరోగ్య పంచాయతీ విభాగంలో జిల్లా, రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకొని నేడు జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికై ప్రశంసలు అందుకున యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.

Related posts

బి ఆర్ ఎస్ పార్టీని ఓడించాలి

Satyam NEWS

అమ్రాబాద్ పులుల అభయారణ్యం: వన్యప్రాణి జనాభా వార్షిక నివేదిక

Satyam NEWS

సిరెంజిల కొరత ముప్పు ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Sub Editor

Leave a Comment