33.2 C
Hyderabad
May 11, 2024 14: 32 PM
Slider ప్రపంచం

ఎందరినో ఉరితీసిన తలారి ఇక స్వేచ్ఛాజీవి……

#talari

అతనొక హంతకుడు. శిక్ష పడి జైల్లో బందీ అయ్యాడు….. అయితేనేం. మంచి ప్రవర్తనతో అందరిని ఆకట్టుకున్నాడు. తనకు తెలిసిన తలారి పని చేసి ఎందరో నేరస్తులకు ఉరి శిక్ష అమలు చేశాడు. 74 ఏళ్ల వయసులో అతని శిక్ష పూర్తయి జైలు బయటకు స్వేచ్ఛాజీవిలా అడుగుపెట్టాడు. బంగ్లాదేశ్‌ కు చెందిన షాజహాన్ భుయాన్ (74) కథ ఇది. 1991లో భుయాన్ ఒక దోపిడీ మరియు హత్య కేసులో జైలు పాలయ్యారు. అతనికి 42 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. శిక్ష కాలంలో మంచి ప్రవర్తన ఉండటంతో అతడికి 2001లో జైలు అధికారులు తలారి ఉద్యోగాన్ని అప్పగించారు. తలారి ఉద్యోగంలో భాగంగా బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ హంతకులు సహా 26 మంది దోషులు, యుద్ధ నేరస్థులను భూయాన్ నిర్దాక్షిణ్యంగా ఉరి తీశాడు. అమలు చేయబడిన ప్రతి ఉరిశిక్షకు అతనికి రెండు నెలల శిక్ష తగ్గేది. జైలులో అతని సత్ప్రవర్తన కారణంగా, భూయాన్‌కు సుమారు 10 సంవత్సరాల శిక్షను రద్దు చేశారు. దాంతో అతను ఢాకా సెంట్రల్ జైలు ప్రాంగణం నుంచి విడుదల అయ్యాడు. మూడు దశాబ్దాలకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత భూయాన్ బయటకు వచ్చాడు.

Related posts

సంజీవరాయ స్వామి ఆలయంలో వేడుకగా మగవారి పొంగల్లు

Satyam NEWS

పేదల చెంతకు కార్పొరేట్ వైద్యం చేరువ చేస్తున్నాం

Satyam NEWS

చంద్రప్రభ వాహ‌నంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

Bhavani

Leave a Comment