28.7 C
Hyderabad
April 27, 2024 04: 18 AM
Slider చిత్తూరు

చంద్రప్రభ వాహ‌నంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

#Sri Kalyana Venkateswara Swam

శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన శుక్రవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు చంద్రప్రభ వాహ‌నంపై నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు.

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగ‌ల్రాయులు, వెంకటస్వామి, కంకణ బట్టార్ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Related posts

దమ్ముంటే చంద్రబాబు నాయుడు సవాల్ ను స్వీకరించండి

Satyam NEWS

మహిళ రైతుల చెమట చుక్కలే చేనుకి జీవనాధారం

Satyam NEWS

బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన సీతక్క

Satyam NEWS

Leave a Comment