30.7 C
Hyderabad
May 5, 2024 04: 33 AM
Slider ప్రపంచం

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనాకు పరాభవం

#UNSecurityCouncil

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చైనాకు ఊహించని పరాభవం ఎదురైంది. చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ఉయ్ ఘర్ ముస్లిం మైనార్టీలపై చైనా ప్రభుత్వం పాల్పడుతున్న అణచివేత పై ఈరోజు భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

ముస్లిం మైనారిటీలపై చైనా ఎంతో కాలంగా అణచివేతకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు భద్రతా మండలిలో లేవనెత్తాయి. రాజకీయ అసంతృప్తిని అణచివేస్తున్నామనే సాకును చూపుతూ కౌంటర్ టెర్రరిజానికి చైనా పాల్పడుతోందని వారు ఆరోపించారు.

10 లక్షల మందికి పైగా ఉయ్ ఘర్లను, ఇతర మైనార్టీలను చైనా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా శాశ్వత ప్రతినిధి కెల్లీ క్రాఫ్ట్ అన్నారు. ఆయన వాదనతో బ్రిటన్, జర్మనీలు ఏకీభవించాయి. ఈ నేపథ్యంలో భత్రతామండలిలో చైనా ఏకాకిగా మిగిలిపోయింది.

Related posts

వరుణ్ తేజ్ వాల్మీకి ఇక గడ్డలకొండ గణేష్

Satyam NEWS

రూ.1.35 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన

Murali Krishna

మంత్రుల సెల్ ఫోన్లు కట్

Satyam NEWS

Leave a Comment