వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అధర్వ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వాల్మీకి’. హరీశ్ శంకర్ మరోసారి మెగా హీరోతో కలిసి తెరకెక్కించిన సినిమా ఈ వాల్మీకీ. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాకి రీమేక్ గా రూపొందినది వాల్మీకి చిత్రం. ఈ చిత్రం పేరు ఇప్పుడు మారింది. కొత్త టైటిల్ “గడ్డలకొండ గణేష్”. వాల్మీకి టైటిల్ మార్చాలి అని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటీషన్ పై చిత్ర యూనిట్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతో టీఎస్ హైకోర్టుకు వాల్మీకి టైటిల్ పై వివాదం హైకోర్టు కు చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. వాల్మీకి టైటిల్ మారుస్తున్నామని చిత్ర యూనిట్ హైకోర్టు కు తెలిపింది.
previous post