బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాదిగలను 29 సంవత్సరాలుగా మోసం చేస్తుందని హైదరాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ ఇంచర్జి ఎడవెల్లి యాదయ్య మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో తక్షణమే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ అంబర్ పేట్ శ్రీరామణ చౌరస్తాలో వాహనాలను అపి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బడుగుల బాలకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో భూష్పాక గణేష్, ఎంఎస్ఎఫ్ సీనియర్ ఈరంటీ విజయ్, పల్లె రాజు, దొబ్బల మహేందర్, బాలస్వామి, మిరియాల అరుణ్, అశోక్, తదితరులు నాయకులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట్