21.7 C
Hyderabad
December 2, 2023 03: 39 AM
Slider వరంగల్

రోడ్డు ప్రమాదం లో నీట్ విద్యార్థిని మృతి

#accident

ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ వద్ద  గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది రోడ్డు ప్రమాదంలో నిట్ విద్యార్థిని  నిస్సీ (20) అక్కడికక్కడే మృతి చెందగా మరో అయిదురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లాలోని ఎన్ఐటి కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థులు ఆరుగురు బుధవారం కాలేజీ నుండి ఓ ప్రైవేట్   స్విఫ్ట్ డిజైర్   కారు అద్దెకు తీసుకొని, ములుగు జిల్లాలోని పర్యటక ప్రాంతాలైన రామప్ప దేవాలయం, అనంతరం లక్నవరం సందర్శించుకొని  గురువారం  తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు.

లక్నవరం నుండి వరంగల్ కు బయలుదేరారు. ఈ క్రమంలో జంగాలపల్లి క్రాస్ వద్దకు రాగానే ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి డివైడర్ను, స్ట్రీట్ లైట్లును బలంగా ఢీ కొట్టి కారు పట్లి  కొట్టింది. ఈ ప్రమాదంలో  నీప్సి అక్కడికక్కడే  మృతి  చెందగా, మిగతా ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి వివరాలు   శ్రేయ (వైజాగ్), సాయి (హైదరాబాద్), సుజిత్ (హైదరాబాద్ )ముర్తుజా (హైదరాబాద్), ఉమర్ (హైదరాబాద్)కు తీవ్ర గాయాలు తగిలాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి చేరుకున్న  ములుగు , సిఐ,ఎస్ఐలు క్షతగాత్రులను ములుగు 108 ద్వారా ములుగు  ఏరియాతో తరలించారు. ఒక విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది గాయపడిన వారిని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తు లో  ఉండడం అతివేగం ప్రమాదం కారణమని స్థానికులు అంటున్నారు. ఈ విధంగా విహారయాత్ర కని బయలుదేరిన విద్యార్థుల ప్రయాణం విషాదం అయింది.  నిప్సి తండ్రి తాడేపల్లి ప్రసాద్ ,గ్రామం ఏలూరు  ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Related posts

జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతాం

Satyam NEWS

మూడు రాజ‌ధానుల‌కే జగన్ ప్ర‌భుత్వం కట్టుబ‌డి ఉంది

Satyam NEWS

అస్తి, చెత్త పన్ను భారం రద్దుచేయాలంటూ సంతకాల సేకరణ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!