39.2 C
Hyderabad
May 3, 2024 12: 35 PM
Slider మహబూబ్ నగర్

అక్రమాలు చేస్తున్న బీరం పై చర్యలకు బీజేపీ డిమాండ్

#BJP Kollapur

అక్రమ బెల్లం, ఇసుక రవాణా దందాల్లో పాల్గొన్న టీచర్ బీరం వెంకట్రామిరెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఈ అంశంపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పానగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందచేశారు.

బీరం వెంకట్రామిరెడ్డి కారణంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో అక్రమ బెల్లం, ఇసుక దందాలు పెచ్చుపెరిగిపోయాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచి అభివృద్ధి పేరు చెప్పి అధికార TRS  పార్టీలో చేరిన MLA బీరం హర్షవర్ధన్ రెడ్డి సమీప బంధువని చెప్పుకొని భీరం వెంకట్రామిరెడ్డి అనే ఈ వ్యక్తి కొల్లాపూర్ నియోజకవర్గంలో బెల్లం ఇసుక దందాలు దౌర్జన్యాలు చేస్తున్నాడని బిజెపి నేతలు అన్నారు.

వెంకట్రామిరెడ్డి పైన తక్షణ చర్యలు తీసుకోవాలని,ఈ దందాలో MLA కి సంబంధముంటే MLA పైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని పానగల్ మండల బిజెపి అధ్యక్షుడు అన్వేష్ డిమాండ్ చేశారు.

Related posts

విశాఖ హెచ్ పి సి ఎల్ లో భారీ అగ్ని ప్రమాదం

Satyam NEWS

కాంటినెంటల్ హాస్పిటల్ లో ఘనంగా ఆటా హెల్త్ సెమినార్

Satyam NEWS

జై కిసాన్ కు విలువేది?: వినూత్న నిరసన తెలిపిన CITU

Satyam NEWS

Leave a Comment