28.7 C
Hyderabad
May 6, 2024 09: 20 AM
Slider నల్గొండ

జై కిసాన్ కు విలువేది?: వినూత్న నిరసన తెలిపిన CITU

#CITUProtest

దేశంలోని నిరంకుశ  బిజెపి ప్రభుత్వానికి అన్నదాతలకు మధ్య జరుగుతున్న ఈ మహత్తర పోరాటంలో ఈ భోగి రోజు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక వ్యవసాయ చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం, విద్యుత్ చట్టం, పట్టణ సంస్కరణ చట్టం, కార్మిక వ్యతిరేక చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసి తగల పెట్టడం జరిగిందిని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి తెలిపారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  ఇందిరా సెంటర్లో  బుధవారం తెల్లవారుఝామున నాలుగు గంటల 30 నిమిషాలకు భోగి మంటలు వేసి కార్మికులు వినూత్న నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ భోగి మొదటి రోజు భోగి మంటలు వేస్తారు. పండగ సందర్భంగా ఇల్లు అవతరణ అంతా శుభ్రం చేసి పనికిరాని వస్తువులను చేత్తను భోగి మంటల్లో తగలబెడతారని, పనికిరాని చట్టాలను భోగిమంటల్లో వేసి తగులబెట్టి నిరసన తెలిపామని అన్నారు.

మన భారతదేశ నినాదం ‘జై జవాన్, జై కిసాన్’ అనే పదాలను మన భారత దేశ సరిహద్దుల్లో పోరాటంలో వీర జవాన్ల అమరులైన వారిని స్మరిస్తూ ఆ పోరాటం మేమే చేశామని గొప్పలు చెప్పుకుంటూ ఎన్నికల్లో లబ్ధి పొందుతూ, నేటి రైతులకు కష్టాలు వస్తే ఈ రోజుకి యాభై రెండు రోజులు ఢిల్లీలో గడ్డకట్టే చలిలో పోరాటం చేస్తుంటే పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు.

రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో యజ్ఞంలా పోరాటం కొనసాగిస్తున్న రైతు బిడ్డలకు వారి వారసుల మైన మనం ఈ సంక్రాంతి విభిన్నంగా జరుపుకోవాలని కోరారు. ఈ పోరాటంలో అన్నదాతలు గెలవాలని, వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని బిజెపి డౌన్ డౌన్ నినాదాలు చేశారు.

ఈకార్యక్రమంలో జిల్లా సిఐటియు కార్యవర్గ సభ్యులు ఎలక సోమయ్య గౌడ్, గుండెబోయిన వెంకన్న, దుర్గారావు, కోటమ్మ, పర్వతాలు, ముస్తఫా, గోవింద్, సైదులు, విప్లవ విజయ్ కుమార్, వెంకన్న, సి ఐ టి యు అనుబంధ సంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి

Satyam NEWS

సొంత డబ్బుతో జర్నలిస్టులను ఆదుకుంటున్న జర్నలిస్టు

Satyam NEWS

పెండింగ్ పనులు తర్వగా పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment