38.2 C
Hyderabad
May 5, 2024 19: 09 PM
Slider జాతీయం

బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు

రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏప్రిల్ 11 న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ చేయనున్న దీక్ష ఏర్పాట్లను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎంపీలు సురేశ్ రెడ్డి, బిబి పాటిల్, పలువురు టిఆర్ఎస్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. రైతుల పంట సేకరణపై కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందన్న ఎమ్మెల్సీ కవిత, ప్రతి రాష్ర్టంలో రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం సేకరించాల్సిందనన్నారు.

సీఎం కేసీఆర్ విధానాలతో, రైతు మద్దతు చర్యలతో తెలంగాణ హరిత ప్రదేశగా మారిందన్న ఎమ్మెల్సీ కవిత, పంట దిగుబడి రెట్టింపు అయిందన్నారు. ధాన్యం సేకరించకపోతే కనీస మద్ధతు ధరకు అర్ధం లేదన్న ఎమ్మెల్సీ కవిత, ప్రతి రైతుకు భరోసా ఇవ్వాల్సిన భాద్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే రైతుల అందోళనతో బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని, ధాన్యం సేకరణలో రైతుల సమస్యలను అర్ధం చేసుకోని పరిష్కరించాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ధాన్యం సేకరణపై రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోతే దేశంలో అహారభద్రత ఇబ్బందులకు గురవుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. ధాన్యం సేకరణపై గత 15 రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేయగా, ఎమ్మెల్యేలు గల్లీల్లో నిరసన తెలియజేశారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం తెచ్చి దేశ రైతాంగాన్ని బలోపేతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఢిల్లీలో రేపు జరగబోయే దీక్షలో మండలం నుండి ఎంపీ వరకు అన్ని స్థాయిల్లోని నేతలు పాల్గొంటారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Related posts

ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Game Start: ఇక ఈ మంత్రికి రాబోయేది కష్టకాలమే

Satyam NEWS

వైభవంగా హుజూర్ నగర్ ఎల్లమ్మ తల్లికి బోనాల సమర్పణ

Satyam NEWS

Leave a Comment