26.7 C
Hyderabad
May 3, 2024 08: 43 AM
Slider ప్రత్యేకం

ఓ దిశ నువ్వెక్కడ: జీవోలు ఇవ్వడమే తప్ప ఆచరించడం శూన్యం

#raviyadav

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఒకటి కాదు, రెండు కాదు తెలంగాణ రాష్ట్రంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదం గా ఉందని అన్నారు.

ఈరోజు బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు మాదాపూర్ డివిజన్ చార్మినార్ కమాన్ వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఒక నిరుపేద ఎస్.టి ఆడబిడ్డ ఎన్నో కష్టాలను ఎదుర్కొని మెడిసిన్ చదివిందని, అలాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది అంటే నమ్మే విధంగా లేదు అని అన్నారు. సైఫ్ అనే వాడు ఎంత వేధించి ఉంటాడు.. వాడే ఇంజెక్షన్ ఇచ్చి చంపి ఉంటాడు.. ఒక్కసారి అందరూ ఆలోచించండి అని అన్నారు.

కనీసం సంతాపం వ్యక్తం చెయ్యకపోవడం ప్రభుత్వానికి సిగ్గు సేటు అని రవికుమార్ యాదవ్ అన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కన్వీనర్ రాఘవేంద్రరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి కన్వీనర్ రాఘవేంద్రరావు, మహిళా మోర్చా కన్వీనర్ కొత్తపెళ్లి పద్మ, రాధాకృష్ణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ , మధు ,రేణుక, అరుణ, మహేశ్వరి ,భారతి, శ్రీలత, దేవి రెడ్డి, విజయలక్ష్మి ,సుశీల, నాగు బాయ్ ,పార్వతి, జ్యోతి, లక్ష్మి , బాలమ్మ పాల్గొన్నారు.

Related posts

టర్కీలో భూకంపం: 53 మంది మృతి

Bhavani

క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి

Satyam NEWS

పోలీసు శాఖలో పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయి

Satyam NEWS

Leave a Comment