Slider విజయనగరం

క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి

#sp

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా గ్రామ సందర్శనలు చేసి, క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పోలీసు స్టేషను పరిధిలోని గ్రామాలు/వార్డుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆధారంగా సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక, సాధారణ గ్రామాలు/వార్డులుగా విభజించి, పోలీసు స్టేషనులో పని చేసే సిబ్బందికి ఆయా గ్రామాలు, వార్డులను దత్తతగా ఇవ్వాలన్నారు. దత్తత గ్రామాల్లో సిబ్బంది తరుచూ సందర్శనలు చేస్తూ, గ్రామాల్లో వివాదాలకు అస్కారం ఉన్న సమస్యలను ముందుగా గుర్తించి, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలన్నారు.

గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధమిక స్థాయిలోనే గ్రామాల్లో సభలు నిర్వహించి, సంబంధిత వర్గాలతో మాట్లాడి, సమస్య తీవ్రతరం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు సృష్టించే వ్యక్తులను ముందుగా గుర్తించి, వారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చి, మంచి ప్రవర్తన కోసం బైండోవరు చేయాలని, వారి వద్ద నుండి సెక్యూరిటీ బాండులను తీసుకోవాలన్నారు.

బైండోవరు చేసినప్పటికీ తగాదాల్లో భాగస్వామ్యులైతే వారిపై సెక్యూరిటీ బాండుగా ఇచ్చిన మొత్తాన్ని వసూలు చేస్తామన్న విషయాన్ని సంబంధిత వ్యక్తులను తెలియజేయాలన్నారు. అక్రమంగా మద్యం అమ్మకాలు, పేకాటలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసి, దాడులు నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. అనంతరం, వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, కొట్లాటలు, హత్యాయత్నం కేసులను జిల్లా సమీక్షించి, దర్యాప్తు పెండింగు లో ఉన్న కేసుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశించారు.

ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ

ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలో గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, గంజాయి అక్రమ రవాణాదారులపై మూడు కేసులు నమోదు చేసి, భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎస్.కోట ఎస్ఐ జి. లోవరాజును జిల్లా ఎస్పీ ఎం.దీపిక నేర సమీక్షా సమావేశంలో ప్రత్యేకంగా అభినందించి, “బెస్ట్ ఫెర్ఫార్మర్” జ్ఞాపికను ప్రదానం చేసారు.

అదే విధంగా వివిధ కేసుల్లో నిందితులను అరెస్టు చేసి, పోయిన ఆస్తులను రికవరీ చేయుటలోను, వివిధ రకాలైన పోలీసు విధులను సమర్ధవంతంగా నిర్వహించుటలో ప్రతిభ కనబర్చిన సిఐలు కే. రవికుమార్, హెచ్. ఉపేంద్ర, జి.సంజీవరావు, ఎస్ఐలు జె. తారకేశ్వరరావు, బి. సాగర్ బాబు, సిద్ధార్ద్ కుమార్, ఎఎస్ఐలు ఎ.లకు నాయుడు, ఎస్.భాస్కరరావు, సిహెచ్.ఆరి, ఆర్. అప్పారావు, హెచ్సీలు ఆర్. మధుసూధనరావు, డి.శంకర్రావు, ఎండి ఇమ్రాన్, కానిస్టేబుళ్ళు ఎం.రఘు, ఎ.పాండురంగ, ఎస్. రమణ, ఎన్.గౌరీ శంకర్, టి.శ్రీనివాస రావు, ఎం. విజయ కుమార్, ఎ.సిహెచ్. శేఖర్, కే. సూరపు నాయుడు, ఎస్.సత్యంనాయుడు,

బండి రాజు, బి. రమేష్, కే.శ్రీనివాసరావు, ఎస్.రామారావు, ఎ.రాంబాబు, ఎస్.శ్రీహరి, ఎ.ఎస్.చత్రపతి, పి.నాగరాజు, హెూంగార్డు వై. రాజేంద్ర లను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, విజయనగరం డీఎస్పీ ఆర్. గోవిందరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీధర్, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డీటీసీ డీఎస్పీ వీరకుమార్, ఏఆర్ డీఎస్పీఎల్. శేషాద్రి, న్యాయ సలహాదారులు వై.పరశురాం,

సీఐలు కే.కే. వి. విజయనాధ్, జె. మురళి, ఈ.నర్సింహ మూర్తి, బి.వెంకటరావు, విజయ ఆనంద్, బి. నాగేశ్వరరావు, ఎం. నాగేశ్వరరావు, హెచ్.ఉపేంద్రరావు, కే.రవికుమార్, ఎల్. అప్పలనాయుడు, వి. చంద్రశేఖర్, ఎం. బుచ్చిరాజు, ఎస్. తిరుమలరావు, టివి తిరుపతిరావు, వివిధ పోలీసస్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పవన్ కల్యాణ్ పై గుర్తు తెలియని వ్యక్తుల నిఘా

Satyam NEWS

లాక్ డౌన్ లోనూ బిట్ శాట్, NTSE -2 ఆన్ లైన్ టెస్ట్స్

Satyam NEWS

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ 23న

Satyam NEWS

Leave a Comment