31.7 C
Hyderabad
May 7, 2024 01: 08 AM
Slider నిజామాబాద్

జుక్కల్ మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బ్లాక్ డే

#Kamareddy

మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ కామారెడ్డి జిల్లా   జుక్కల్ మండల కేంద్రంలో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో గత ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ పోరాటాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇప్పటికి ఆరు నెలల పూర్తయిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డే గా నిర్వహించామని తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలంటూ రైతుల పోరాటం జరుగుతున్నదని ఆయన అన్నారు.

కానీ ఈ ప్రభుత్వానికి కనీస బాధ్యతలు లేకుండా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటే మంచిదని, లేదు అంటే మరిన్ని తీవ్రమైన పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు షైక్ ఫిర్దోస్ మండల కమిటీ సభ్యులు షేక్ వాజిత్ పాల్గొన్నారు.

Related posts

అర్ధరాత్రి అరెస్టులు: కీలక జనసేన నేతల అరెస్టు

Satyam NEWS

మెగాస్టార్ తదుపరి చిత్రం ప్రారంభమైంది

Satyam NEWS

ధరణీ పోర్టల్ ద్వారా 12 లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్

Satyam NEWS

Leave a Comment