23.2 C
Hyderabad
May 8, 2024 00: 14 AM
Slider నిజామాబాద్

ధరణీ పోర్టల్ ద్వారా 12 లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్

#kapoul

సీఎం కేసీఆర్ పై 100 నామినేషన్లు వేస్తే ఓట్లు చీలుతాయి తప్ప కేసీఆర్ ను ఓడించలేరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులతో కెఏ పాల్ సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కెఏ పాల్ మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ కు తానంటే అమితమైన ప్రేమ ఉండేదని ఇప్పుడు తన ఊసే ఎత్తడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వల్ల ఒక్కొక కుటుంబంపై 20 లక్షల అప్పు ఉందని చెప్పారు. మునుగొడులో ఒక్కొక సర్పంచుకు 2 కోట్లు ఇచ్చారని ఇక్కడ గెలుపు కోసం ఒక్క ఓటుకు 3 లక్షలైన ఇస్తారని ఆరోపించారు. తన జీవితంలో ఎవరికి నమస్కారం చేయలేదని, రైతుల కోసం చీఫ్ జస్టిస్ కు నమస్కరించానని తెలిపారు.

రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చట్టాలు తెస్తే కేసీఆర్ వాటికి మద్దతిస్తే ప్రధాని మోడీకి 72 గంటల సమయమిచ్చి నల్ల చట్టాలు వెనక్కి తీసుకొనేలా చేశానని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా 12 లక్షల కోట్లు దోచుకున్నారని, 6 లక్షల కోట్లు దాచుకున్నారని, 5 లక్షల కోట్ల అప్పు చేసారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, ఒక్కో రైతు పేరిట ప్రపంచ బ్యాంకు, కేంద్రం ద్వారా 5 లక్షల అప్పు చేసి కేవలం 50 వేల రుణమాఫీ చేశారన్నారు. కేసీఆర్ పై పోటీకి రైతుల నుంచే ఒక వ్యక్తిని ఎన్నుకుని అభ్యర్థిగా బరిలో ఉంచాలని కెఏ పాల్ సూచించారు. అలా చేస్తే రైతుల పక్షాన నవంబర్ 10 నుంచి 30 వరకు కామారెడ్డిలో తానే స్వయంగా ప్రచారం చేస్తానన్నారు.

కేసీఆర్ ను ఓడించి రైతు అభ్యర్థిని గెలిపించుకుంటే కామారెడ్డి చరిత్రలో నిలుస్తుందని తెలిపారు. రైతులు తమ అభ్యర్థిని నిలిపి గెలిపిస్తే కామారెడ్డి ప్రజలకు మూడు పనులు చేస్తానన్నారు. అపోలో ఆస్పత్రిని మించి కామారెడ్డిలో ఆస్పత్రి నిర్మిస్తానని, ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని, కామారెడ్డిలో హెలికాప్టర్ అందుబాటులో ఉంచి రోగులను అందులోనే తరలిస్తానన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని, దానికోసం కంపెనీలు ఏర్పాటు చేస్తానని, రైతులు, నిరుద్యోగుల్లో కన్నీళ్లు లేకుండా చేస్తానని పేర్కొన్నారు. డిసెంబర్ 3 న ఎన్నికల ఫలితాల అనంతరం 10 వ తేదీన ఆస్పత్రి, ఉచిత విద్య కోసం శంకుస్థాపన చేసి మార్చి 10 నాడు ప్రారంభిస్తాని హామీ ఇచ్చారు.

Related posts

థెరపీ:బ్రెయిన్‌ సర్జరీ చేస్తుంటే వయొలిన్‌ వాయించి

Satyam NEWS

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు జగన్ నిర్వాకం

Satyam NEWS

ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం

Sub Editor

Leave a Comment