38.2 C
Hyderabad
May 5, 2024 21: 41 PM
Slider మెదక్

ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనాను పారద్రోలండి

#fever survey

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే దుబ్బాకలో కొనసాగుతున్నది. గత రెండు రోజులుగా చేస్తున్న జ్వర సర్వే నేడు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డులో జరిగింది.

ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆస యాదగిరి మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండి  ప్రభుత్వ ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు.

శుభ్రత పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని చేతులను ప్రతి అరగంటకు ఒకసారి శుభ్రపరచుకోవాలని సమదూరం పాటించి శానిటైజర్ వాడాలని ఆయన సూచించారు.

కరోనా  మూలంగా ప్రజలు అనారోగ్యానికి గురికావద్దని సర్ది దగ్గు  జ్వరము తలనొప్పి వచ్చినవారు తమకు సమాచారం అందిస్తే టాబ్లెట్ కిట్టు  పంపిస్తామని తెలిపారు.

ఈ సర్వే కార్యక్రమంలో ఆర్ పి లత అంగన్వాడి టీచర్ రేణుక ఆశ వర్కర్ సంతోష తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమల బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ కు ఆహ్వానం

Satyam NEWS

ఎన్నికలు వస్తేనే కేసీఆర్ నోట పధకాల మాట

Bhavani

కలమే నిజమైన జర్నలిస్టులకు బలం….బలహీనత

Satyam NEWS

Leave a Comment