38.2 C
Hyderabad
May 3, 2024 22: 38 PM
Slider శ్రీకాకుళం

కార్పొరేట్ హాస్పిటల్స్ ను ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలి

#srikakulam

ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం ప్రారంభమై ఆరు నెలలు పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మోడీ విధానాలను నిరసిస్తూ అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బ్లాక్ డే పిలుపును శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో  సి ఐ టి యు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం  మద్దతుగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై. చలపతిరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కరగాన కొండయ్య మాట్లాడుతూ కేంద్రలో బిజెపి ప్రభుత్వం  కార్పొరేట్లకు అనుకూలంగా రైతు వ్యతిరేక వ్యవసాయ 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని దివాలా తీసే విధానాలు పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ చట్ట సవరణ బిల్లు, రైతులకు మద్దతు ధర కల్పించాలని ఆరు మాసాల నుండి కరోనా సైతం లెక్కచేయకుండా పోరాటం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం లోకి వస్తున్నారని  గుర్తు చేశారు.

దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాలన్నారు. ఆక్సిజన్ బెడ్స్ ఆరోగ్య వసతులు మెరుగు పర్చాలని, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేరళ మాదిరిగా 16 రకాలు నిత్యవసర వస్తువులు సరుకులు ఇవ్వాలని మండల , గ్రామీణ స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలు పెట్టాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ కరోనా సమయంలో  ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్ లో అక్రమాలు అరికట్టాలని తెలిపారు.

పీఎం కేర్ నిధుల నుండి రాష్ట్రాలకు నిధులు కేటాయించాలి. ప్రతి కుటుంబానికి 7,500 నగదు ఇవ్వాలి, ప్రతి మనిషికి 10 కేజీలు బియ్యం ఆరు నెలల పాటు ఉచితంగా ఇవ్వాలి తెలిపారు. లాక్ డౌన్ సమయం లో కార్మికులను తొలగించ రాదు జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలి అన్నారు.

కార్మిక చట్టాలను నాలుగు కోడ్ గా మార్చే  కట్టు బానిస  విధానాలు విరమించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కరోనా సమయంలో బిజెపి ప్రభుత్వం వారు ప్రజా ప్రతినిధులు మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో లో శేఖర్ , అప్పన్న, పోతయ్య, కృష్ణ ,పాపారావు, ఎర్రయ్య బాలరాజు రంగా భద్ర రాజు ఇతరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం బీఆర్ఎస్ సభ ఫెయిల్: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS

అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Satyam NEWS

నవ సమాజ నిర్మాత మహాత్మ జ్యోతిరావు పూలే!

Bhavani

Leave a Comment