30.7 C
Hyderabad
May 5, 2024 03: 13 AM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

rains in ap

బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవ శం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలియచేసింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం కూడా కొనసాగుతోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు ఉత్తర ఇంటిరియర్‌ కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాగల 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, ఆంధ్రా తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం.. దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు. కోస్తా ఆంధ్రా, యానం, తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసేఅవకాశం వుందని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా నేడు, రేపు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

Related posts

అప్పులిచ్చిన వ్యక్తి రుణం తీర్చుకున్న జగన్

Satyam NEWS

మజీద్ నిర్మాణానికి టెంకాయ కొట్టిన మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

రాజంపేట వైసీపీ లో భూ కబ్జాల రగడ…

Bhavani

Leave a Comment