31.2 C
Hyderabad
May 3, 2024 01: 44 AM
Slider రంగారెడ్డి

విద్యా ప్రమాణాలు పెంచేందుకు బిఎల్ఆర్ ట్రస్ట్ కృషి

#BLRTrust

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు సాధించేందుకు బి ఎల్ ఆర్ ట్రస్ట్ కృషి చేస్తుందని బి ఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చిల్కానగర్ డివిజన్ చిల్కానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శనివారం బండారి లక్ష్మారెడ్డి గౌరవ వేతనాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న విషయాన్ని ట్రస్ట్ దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు చదువుకున్న నిరుద్యోగులను చేరదీస్తూ వారిని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించి నెల నెల గౌరవ వేతనం అందజేయడం జరుగుతుందన్నారు.

మల్లాపూర్ నాచారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించి నెలనెలా వారికి వేతనాలు అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎంబిబిఎస్ వైద్య విద్యలో సీటు సాధించిన పేద విద్యార్థులను గుర్తించి వారికి ఐదున్నర సంవత్సరాల ఫీజులు సైతం తమ ట్రస్ట్ చెల్లిస్తుందన్నారు. క్రీడలలో ఉత్తమ క్రీడాకారులుగా జాతీయస్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు అన్ని విధాల ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, మాస శేఖర్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆది, ఇతర సిబ్బంది, నాయకులు కొండల్ రెడ్డి, జగన్, మహేందర్, యాదగిరి, చింటూ, సుధాకర్, రఫీ, వెంకట్, ఫోటో బాలు, నిరంజన్, నవీన్, బాబా, సమీర్, నరసింహ, రవి, రాజిరెడ్డి, సుభద్ర, సత్యవతి, కనకతార తదితరులు పాల్గొన్నారు.

Related posts

అయోధ్య రామమందిర నిర్మాణం కోట్లాది ధర్మపరిరక్షకుల కోరిక

Satyam NEWS

గో గ్రీన్: గ్రీన్ ఛాలెంజ్ లో ఏపి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

Satyam NEWS

ఒక్కరోజులో పతనమైన పూల ధరలు

Bhavani

Leave a Comment