29.7 C
Hyderabad
April 29, 2024 08: 23 AM
Slider చిత్తూరు

తుఫాను వస్తేనే విద్యుత్ శాఖ కార్మికులు గుర్తొస్తారా?

#powerdepartment

రాష్ట్ర వ్యాప్తంగా తుఫానులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రంగానికి గుర్తొచ్చే మొట్టమొదటి డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ. అక్కడ పనిచేసే రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు, ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే. విద్యుత్ శాఖలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగస్తులకు, ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులకు తుఫాను కారణంగా సెలవులు లేవు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఏసీ గదులలో కూర్చొని ఆదేశాలు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కార్మికుల ఉద్యోగ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకూడదని ప్రభుత్వ,విద్యుత్ శాఖ విద్యుత్ ఉద్యోగస్తులు,ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికులు రాత్రింబగళ్లు పని చేస్తున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా చాలీచాలని జీతాలతో అనేక సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 23 వేల మందిని రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు పెంచుతానని పాదయాత్ర సందర్భంగా సీఎం జగన్ ఇచ్చిన మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తుఫాను సందర్భంగా భారీ వర్షాలతో గ్రామాలలో పట్టణాలలో చెట్టుకొమ్మలు విరిగి రోడ్డుపై పడే కరెంట్ తీగల కారణంగా పాదచారులకు ప్రాణ నష్టం జరగకూడదని ఎప్పటికప్పుడు కరెంటు పోల్స్, పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ టవర్ లు ఎక్కి హై టెన్షన్ లైన్ల మరమ్మత్తులలో విద్యుత్ లైన్ మాన్ లకు,ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎటువంటి ప్రమాదాలు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆయన కోరారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి సబ్ స్టేషన్ లలో, కాల్ సెంటర్స్ లలో RAIN కోట్స్,హ్యాండ్ గ్లౌజ్స్,గమ్ భూట్స్,ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లాంటి సేఫ్టీ పరికరాలను వెంటనే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు.

Related posts

జాతీయ స్థాయి స్విమ్మింగ్ మెడల్ సాధించిన వసీం

Satyam NEWS

త్వరలోనే కొల్లాపూర్ కు రానున్న కేంద్ర మంత్రులు

Satyam NEWS

“నేనెవరు” అంటున్న కోలా బాలకృష్ణ!!

Satyam NEWS

Leave a Comment