37.7 C
Hyderabad
May 4, 2024 13: 35 PM
Slider మహబూబ్ నగర్

బోర్డులు పెట్టి బోర్లా వేసేస్తున్నారు బిల్లులు బాదేస్తున్నారు

#Bills

స్మార్ట్ పాయింట్లు భారీ తగ్గింపు అని బోర్డులు పెట్టి జనాన్ని బోర్లా వేస్తూ బిల్లులు బాదేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు నాలుగు కూడలికి దగ్గరలో ఉన్న స్మార్ట్ పాయింట్ లో బుధవారం స్పెషల్ ఆఫర్ అంటూ బోర్డులో ఉన్న ధర కంటే 20% పైగానే దండుకుంటున్నారు.

ఎన్ని ఫిర్యాదులు చేసిన అధికారుల్లో చలనం లేకపోవడంతో వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా చెలరేగిపోతున్నారు.గతంలో కనీసం ధరల పట్టిక వస్తువు వద్ద ఉండేది. ప్రస్తుతం మరో కొత్త మోసాంతో తెర లేపుతూ వస్తువు వద్ద విక్రయించే ధర లేకుండా ఎంఆర్పి కంటే తక్కువ అంటూ కాగితపు పట్టిక ఉంచారు.

అదేవిధంగా నాలుగు బిల్ కౌంటర్లు ఉన్న ఒక్కరు లేక ఇద్దరు మాత్రమే బిల్ కౌంటర్లలో ఉంటూ బిజీగా వ్యవహరిస్తూ వస్తువుల ధరలను అడగాలనుకున్న వీలు లేకుండా వారు చాలా పనిలో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.పైన పటారం లోన లొటారం అన్న చందంగా ధరల పట్టికలో ఒక ప్రకటన చూపుతూ బిల్లులో మాత్రం అధిక ధరలు దండుకుంటున్నారు.

గతంలోఎమ్మార్పీల ధరలకంటే ఎక్కువ ధరలకు విక్రయించిన తూకాలలో మోసం చేసిన పత్రికలలో కథనాలు వచ్చిన అధికారుల్లో చలనం లేకపోవడం పలు అనుమానాలకు తావిచ్చినట్టు అవుతుంది. అదేవిధంగా ఓ వ్యక్తి ఫోన్ పే ద్వారా బిల్లు చెల్లించిన మాకు డబ్బులు రాలేదంటూ అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు కథనం చూశాం.

బుధవారం స్వీట్ కార్న్ బోర్డులో పది రూపాయలు ఉండగా బిల్లులో మాత్రం 12 రూపాయలకు విక్రయించారు. ఇదే తరహాలో అన్ని వస్తువులకు ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేస్తూ అధికంగా దండుకుంటున్నారు. ఇంత బహిరంగంగానే స్మార్ట్ పాయింట్లో మోసం జరుగుతునప్పటికి అధికారుల నిర్లక్ష్యం వహించడం అర్థం కాని ప్రశ్న గానే మిగులుతుంది.

చిన్న దుకాణ వ్యాపారస్తులు పొరపాటున చిన్న చిన్న తప్పులు జరిగిన వెంటనే స్పందించే అధికారులు ఇక్కడ మాత్రం నిద్రమత్తు వదలక పోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వదిలాలని ఈ స్మార్ట్ పాయింట్ చేసే మోసాలను అరికట్టీ వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Related posts

అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తే దాడి చేస్తారా?

Satyam NEWS

ప్లాస్టిక్‌ కోర్సుల పట్ల విద్యార్ధులు మక్కువ చూపాలి

Satyam NEWS

డాక్టర్ అంబేద్కర్ కు జర్నలిస్టుల ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment