28.7 C
Hyderabad
April 28, 2024 07: 30 AM
Slider ప్రకాశం

అత్యాచారయత్నం కేసులో నిందితుడికి 5 ఏల్ల జైలు శిక్ష

#N.G.Padu SSI Shashi Kumar

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో తేది:09.03.2022 న మధ్యాహ్నం సమయంలో N.G.పాడు మండలానికి చెందిన మతిస్ధిమితం లేని యువతిపై అదే మండలానికి చెందిన తుమాటి తిరుమల స్వామి (27 సం) అనే వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ఘటనలో N.G.పాడు ఎస్సై శశి కుమార్ కేసును నమోదు చేశారు.

ఎస్సై ఒంగోలు రూరల్ సిఐ ఆర్ రాంబాబు దర్యాప్తు చేపట్టి, నిందితుడుని అరెస్టు చేసి, రిమాండుకు పంపించి, కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసారు. తరువాత ముద్దాయిని జిల్లా రెండవ ADJ కోర్ట్ జడ్జి సోమశేఖర్ ముందు హాజరుపరిచి, తగిన సాక్ష్యాధారాలతో నిందితుడు అత్యాచారయత్నం చేయబోయినట్లు కోర్టులో నేరనిరూపణ అయినందున తేది:

27.06.2023 న నిందితుడుకి 5 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 2000 జరిమానా విధించారు. పై కేసులో కోర్ట్ లో సరైన సాక్ష్యాధారాలతో సమర్ధవంతంగా ట్రయిల్ మానిటరింగ్ చేసి నిందితుడుకి శిక్షిపడటంలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రస్తుత్త ఒంగోలు తాలూకా సీఐ ఆర్ రాంబాబు, అడిషనల్ పిపి యత్తపు కొండా రెడ్డి, కోర్ట్ లైజన్ ఏఎస్సై లక్ష్మీనారాయణ, సమన్స్ అమలు పరిచిన NG పాడు ASI కొండయ్య లను జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ ప్రత్యేకంగా అభినందించారు.

Related posts

రెవెన్యూకు వెళ్లలేం.. మున్సిపల్ లో చేయలేం

Satyam NEWS

కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కాలం ముగిసినట్లేనా?

Satyam NEWS

పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment