39.2 C
Hyderabad
May 4, 2024 21: 44 PM
Slider జాతీయం

గోరఖ్ నాథ్ ఆలయంలో బాంబు కలకలం: ఒకరి అరెస్టు

#gorakhpur

ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం ఒక్క సారిగా కలకలం రేపింది. చివరకు అది ఒక పిచ్చివాడి పనిగా తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ నాథ్ ఆలయంలో ఉండగానే టెర్రరిస్టులు ఆలయ ప్రాంగణంలోకి చొరబడ్డారన్న సమాచారం రావడంతో కలకలం రేగింది.

పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 112కు కాల్ వచ్చిన వెంటనే డీఎం కృష్ణ కరుణేష్, ఎస్‌ఎస్పీ డాక్టర్ గౌరవ్ గ్రోవర్ బలగాలతో గోరఖ్‌నాథ్ ఆలయానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్ వచ్చిన సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసి నిర్న సాయంత్రం ఎస్‌ఓజి వారు నిందితుడిని పట్టుకుని కాంట్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన నిందితుడిని బీహార్‌లోని వైశాలి నివాసి కుర్బన్ అలీగా గుర్తించారు.

గోరఖ్‌నాథ్ ప్రాంతంలోని పారిశ్రామిక ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ బేకరీ షాపులో పనిచేస్తున్నాడు. సమాచారం ప్రకారం, కుర్బన్ అలీ ఆదివారం దుకాణ యజమానితో వాకింగ్ కోసం వెళ్ళాడు. ఈ క్రమంలో నల్ల దుస్తులు ధరించిన నలుగురు దుండగులు బాంబులతో గోరఖ్‌నాథ్ ఆలయంలోకి ప్రవేశించారని డయల్ 112లో పోలీసులకు సమాచారం అందించాడు. టిఫిన్‌లో కేక్ మధ్యలో బాంబు పెట్టారని, మెయిన్ గేట్ చెకింగ్‌లో పట్టుకోలేదని కూడా చెప్పాడు. ఈ సమాచారం తెలియగానే పోలీసు శాఖలో కలకలం రేగింది. డీఎం ఎస్‌ఎస్పీ సహా ఉన్నతాధికారులందరూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు విచారించగా నిందితుడు కుర్బన్ అలీ పట్టుబడ్డాడు.

Related posts

మస్క్ నాయకత్వంలో ట్విట్టర్ సురక్షితం కాదు

Bhavani

టీడీపీ సీనియర్ నేత కళావెంకట్రావు అరెస్ట్

Satyam NEWS

శక్తి స్వరూపిణి

Satyam NEWS

Leave a Comment