29.7 C
Hyderabad
May 6, 2024 06: 19 AM
Slider ప్రత్యేకం

ఉత్తర ద్వార దర్శనంతో పులకించిన భక్తులు

ఆదిశిలా క్షేత్రము మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం తో భక్తులు పులకించి పోయారు. సంవత్సరానికి ఒక మారు వచ్చే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తర ద్వారానికి అర్చకులు మధుసూదనచారి రమేష్, దీరేంద్ర దాస్, రవి, వాల్మీకి పూజారుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి భక్తులను ఆహ్వానించారు. అనంతరం దేవాలయంలో శ్రీ అనంతపద్మనాభ స్వామి, శ్రీ తిమ్మప్ప స్వామి, లక్ష్మీదేవి అమ్మవార్లకు పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండే భక్తుల సందడి నెలకొంది. ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు పులకించి పోయారు. ఈ సందర్భంగా ప్రహ్లాద రావు మాట్లాడుతూ అపర తిరుపతిగా శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం విలసిల్లుతోంది. స్వామిని సందర్శించుకుని భక్తులు పునీతులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు, నాగరాజు శర్మ, భక్తులు పాల్గొన్నారు.

Related posts

10న జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం

Satyam NEWS

ఏపీ హైకోర్టు మార్పు ప్రతిపాదన లేదు

Satyam NEWS

ఫెస్టివల్:అభివృద్ధి ప్రదాత ఉద్యమ నేత కెసిఆర్

Satyam NEWS

Leave a Comment