Slider కవి ప్రపంచం

శక్తి స్వరూపిణి

#Sanigarapu Rajamohan

అమ్మా దుర్గా

మహంకాళి మాతా

అసురసంహారిని

అప్రమేయ సుప్రకాశిని

            – అమ్మా దుర్గా –

చంద్రవదన సింహావాహిని

చతుర్భుజ ఆయుధదారిని

సర్వోపద్రవనివారిని

సకలసౌభాగ్యదాయిని

            – అమ్మా దుర్గా –

బోనాల పండుగ బహుదండిగ

భక్తులు కొలుతురు మది నిండుగ

పోతరాజుల, శివసత్తులు

చిందులు వేయుచు ఆడేరు

మేకపోతులు, గొర్రెలు, కోళ్లు

భళి భళి అంటు బలి ఇచ్చేరు

            – అమ్మా దుర్గా –

దయగల తల్లివే ధర్మ దేవతవే

కష్టాలు కడతేర్చు కల్పవల్లివే

            – అమ్మా దుర్గా –

భాగ్యనగర దివ్యదామిని

భక్తకోటి శక్తిప్రదాయిని            

జగమునేలు జనని

జయమునీయవే భవాని

శనిగరపు రాజమోహన్, హన్మకొండ, వరంగల్  – 506004   Ph# 6304008256

Related posts

కాలువ నిర్మాణంపై కాంగ్రెస్ ఆందోళ‌న‌

Sub Editor

మూడున్నరేళ్లుగా బిసిలకు అన్యాయం

mamatha

రేపు మాస్టర్ ప్లాన్ బాధిత రైతులతో కెఏ పాల్ సమావేశం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!