28.7 C
Hyderabad
May 6, 2024 01: 58 AM
Slider నల్గొండ

ఇంటి నుండి వెళ్లిపోయిన బాలుడి గుర్తించిన పోలీసులు

boy traising

న‌ల్గొండ జిల్లాలో ఉన్నఅన్ని మిస్సింగ్ కేసులను చేధించడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ, డిఐజి ఏ.వి. రంగనాధ్ ఏర్పాటు చేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం సమర్ధవంతంగా పని చేస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తోంది.

జిల్లా వ్యాప్తంగా మిస్సింగ్ కేసులను పరిష్కరించి తప్పిపోయిన వారు, ఇంట్లో నుండి వెళ్లిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం, వారి తాజా పరిస్థితిని తెలియజేయడం ప్రధాన లక్ష్యంగా సిఐ సత్యం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బృందం ఒక్కో కేసును చేధిస్తూ మంచి ఫలితాలు సాధిస్తుంది. అందులో భాగంగా 2014 సంవత్సరంలో నల్లగొండ వన్ తౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ కు చెందిన మాలే యల్లారెడ్డి కుమారుడు మాలే మణిపాల్ రెడ్డి తన తండ్రి మందలించాడని 2014 సంవత్సరంలో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయంపై తండ్రి యల్లారెడ్డి పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సిఐ సత్యం బృందం పోలీస్ శాఖ అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మణిపాల్ రెడ్డి హైదరాబాద్ కూకట్ పల్లిలోని శాంతినగర్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్నట్లుగా గుర్తించి సోమవారం ఆ యువకుడిని హైదరాబాద్ నుండీ నల్లగొండకు తీసుకువచ్చి తల్లితండ్రులకు అప్పగించారు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు.

ఆరు సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయిన తమ కుమారుడిని కలుసుకున్నతల్లిదండ్రులు ఆనందంతో కన్నీటీ పర్యంతమయ్యారు. తమ కుమారుడిని కనిపెట్టి తీసుకువచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

మిస్సింగ్ కేసులను చేధించడంలో కీలకంగా పని చేస్తున్న సిఐ సత్యం, ఎస్.ఐ.లు రాంబాబు, నాగుల్ మీరా, కానిస్టేబుల్స్ నర్సింహా, మధు, నజీర్, బాలయ్య, సాయి సందీప్ లను డిఐజి ఏ.వి.రంగనాధ్ ప్రత్యేకంగా అభినందించి మిగిలిన కేసులను త్వరితంగా పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.

Related posts

28న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో మహాత్మాగాంధీ ప్రార్థనాగీతం ఆవిష్కరణ

Satyam NEWS

ఈ సారి పులివెందులలో జగన్ కు కష్టమే…

Satyam NEWS

ట్రాన్స్ఫర్ :తెలంగాణాలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Satyam NEWS

Leave a Comment