26.7 C
Hyderabad
May 15, 2024 10: 25 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలంలో లో రేపటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

#srisailam

జనవరి 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నికదీక్షతో ఏడురోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీన ముగియనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ మల్లికార్జునస్వామివారికి ఏటా రెండుసార్లు అనగా మకర సంక్రమణం. సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మరియు మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

బ్రహ్మోత్సవ కార్యక్రమాలు :

ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభంగా 12.01.2022 ఉదయం గం.9.00లకు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశ కార్యక్రమం నిర్వహించబడుతుంది. తరువాత వేదపండితులు చతుర్వేద పఠనాన్ని చేయడం జరుగుతుంది. అనంతరం లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. సంకల్ప పఠనం తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ జరిపించబడుతుంది. గణపతి పూజ. ఈ కార్యక్రమాల తరువాత బ్రహ్మోత్సవ నిర్వహణకు అధ్వర్యం వహించే శివపరివార దేవుడైన చండీశ్వరునికి విశేషపూజలు జరిపించబడతాయి. అనంతరం కంకణధారణ, ఋత్విగ్వరణం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తు హోమం, మండపారాధనలు, కలశస్థాపన, పంచావరణార్చనలు, పారాయణాలు నిర్వహిస్తారు

12వ తేదీ ధ్వజారోహణ 13వ తేదీ బృంగి వాహన సేవ

 14వ తేదీ రావణ వాహన సేవ

 15వ తేదీ నంది వాహన సేవ ,బ్రహ్మోత్సవ కళ్యాణం

 16వ తేదీ కైలాస వాహన సేవ

 17వ తేదీ పూర్ణాహుతి 18వ తేదీ అశ్వవాహన సేవ   నిర్వహిస్తారు

Related posts

హెల్మెట్ సీటు బెల్ట్ పెట్టుకోని వారిపై 660 కేసులు….!

Satyam NEWS

మెరుగైన వైద్య సేవలు అందేలా అంకితభావంతో పనిచేయాలి

Satyam NEWS

రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదలకుండా దోపిడీ చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment