38.2 C
Hyderabad
April 29, 2024 19: 52 PM
Slider విజయనగరం

హెల్మెట్ సీటు బెల్ట్ పెట్టుకోని వారిపై 660 కేసులు….!

స్పెష‌ల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ప‌రంగా ఏడు కేసులు… మ‌ద్యం తాగి అడ్డంగా బుక్కైన వారిపై 27 లిక్క‌ర్ కేసులు… హెల్మెట్ లు,సీటు బెల్ట్ పెట్టుకోని వారిపై 660 కేసులు న‌మోదు చేసారు… విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీసులు.

ఈ మేర‌కు జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాల‌తో మద్యం అక్రమ రవాణదారులపై స్థానిక పోలీసులు మరియు ఎస్ఈబీ పోలీసులు సంయుక్తంగా రైడ్స్ నిర్వహించి, 7 కేసులు నమోదు చేసి, నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 8 లీటర్ల నాటుసారాను, 7.56 లీటర్ల ఐ.ఎం.ఎల్.ఎఫ్. మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా నాటుసారా తయారీకి సిద్దం చేసుకొన్న 600 లీటర్ల బెల్లం ఊటను, సారా తయారీకి వినియోగించే వంట పాత్రలు, డ్రమ్ములను ధ్వంసం చేశారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలుస్తున్న వారిపై 27 కేసులను పోలీసులు నమోదు చేశారు.

ఇక మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై 17 కేసులను పోలీసులు నమోదు చేశారు. హెల్మెట్ లు, సీటు బెల్టులు ధరించకుండా వాహనాలు నడిపిన వారిపైన, వాహనాలను అతి వేగంగా నడిపిన వారిపైన, ఎంవి నిబంధనలను అతిక్రమించిన వారిపైన 660 కేసులను నమోదు చేసి, ల‌క్షా,57 వేల 125/- లను ఈ-చలానగా విధించారు.

సీఎం జ‌గ‌న్ మాన‌సిక పుత్రిక అయిన దిశా యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టారు, దాదాపు 2,106 మంది దిశా యాప్ ను తమ స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకొనే విధంగా చర్యలు చేపట్టారు.

వీటితో ఇప్ప‌టివ‌ర‌కు దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 3,80,977 కు చేరింది.పోలీసు అధికారులు, మహిళా పోలీసులు జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి నేరాలు జరుగుతున్న తీరును వివరించి, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

జిల్లాలో రామభద్రపురం పీఎస్ పరిధిలో నిషేధిత గుట్కాలు కలిగిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి 4,400/- ల విలువైన నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు.

ఆపరేషన్ పరివర్తన 2.0 లో భాగంగా నాటుసారా ప్రభావిత గ్రామాల్లో సెబ్ అధికారులు గ్రామస్తులతో మమేకమై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నాటుసారా తయారీ, వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను వివరించి, నాటు సారా తయారీ, సరఫరా, అమ్మకాలకు స్వస్తి పలకాలని కోరారు.

ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ ఎస్..బొండ‌ప‌ల్లి ఎస్ఐలు…అటు మ‌ద్యం త‌నిఖీలు. ఇటు రోడ్డు ప్రమాదాల జ‌ర‌గ‌కుండా త‌ర‌చూ రహదారి ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ల వద్ద వాహనదారులు రాత్రి సమయాల్లో దూరం నుండే ప్రమాద స్థలాలను సులువుగా గుర్తించే విధంగా లైట్లతో కూడిన సూచికలను ఏర్పాటు చేశారు.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్. నెట్, విజయనగరం

Related posts

దేవాలయాల్లో ఇక నుంచి రిజర్వేషన్ పద్ధతి

Satyam NEWS

రక్తదానం చేయడం అంటే ప్రాణం నిలబెట్టడమే

Satyam NEWS

నల్లగార్లపాడు రోడ్డు బాగుచేయించండి మహా ప్రభో……

Satyam NEWS

Leave a Comment