33.2 C
Hyderabad
May 4, 2024 00: 37 AM
Slider మహబూబ్ నగర్

హై లెవెల్ బ్రిడ్జికి 45 కోట్లు మంజూరు

#ramulu

దుందుభి నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి 45 కోట్లు మంజూరైనట్లు ఎంపీ రాములు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా రఘుపతి పేట రామగిరి మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి 45 కోట్లు మంజూరు అయినట్టు మంగళవారం ఎంపీ పోతుగంటి రాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ ఎంపీ చిరకాల వాంఛ అయినా రఘుపతి పేట రామగిరి దుందుభి నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం 45 కోట్ల రూపాయలు సాంక్షన్ కావడం పట్ల సీఎం కేసీఆర్ కు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

కల్వకుర్తి  తెలకపల్లి ప్రజల చిరకాల స్వప్నమైన రఘుపతిపేట రామగిరి మధ్యన దుందుభి నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించాలని గతంలో సీఎం కేసీఆర్ కు వినతి పత్రం అందించామన్నారు. నదిపై బ్రిడ్జ్ లేకపోవడం వలన వర్షాకాలం రవాణా సౌకర్యం కల్వకుర్తి నుండి తెలకపల్లి వరకు పూర్తిగా స్తంభించి పోతుందని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కల్వకుర్తి తెలకపల్లి మండలాల ప్రజలు పడుతున్న అవస్థలు చూడలేక ముఖ్యమంత్రి తీసుకువెళ్లినట్టు చెప్పుకొచ్చారు.

అతి త్వరలో నే నిర్మాణ పనులు కూడా చేపడతామని అన్నారు. త్వరితగతిన  హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం వల్ల కల్వకుర్తి నుండి తెల్కపల్లి వరకు రవాణా సదుపాయం మెరుగుపడుతుందని ఈ మార్గం రఘుపతిపేట- రామగిరి- తెలకపల్లి -లింగాల- అంబటిపల్లి- కొల్లాపూర్ నేషనల్ హైవే కి కలుస్తుందని అదేవిధంగా కొల్లాపూర్- లింగాల-కల్వకుర్తి-హైదరాబాద్ కు దూరం తగ్గుతుందని తెలిపారు. తద్వారా ఈ ప్రాంతం పలు రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

హైదరాబాద్ లో ఉన్న నాయకా విశాఖ ఎప్పుడొస్తావు?

Satyam NEWS

అమెరికా బ్యాంకుల రుణం ముందే చెల్లించివేస్తున్న అదానీ

Satyam NEWS

వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లీగ్ జిల్లా పోటీలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment