40.2 C
Hyderabad
May 2, 2024 15: 14 PM
Slider హైదరాబాద్

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

#protest

అంబర్ పేట్ నియోజకవర్గ ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టివ్వాలని  ముసరాంబాగ్ లోని మూసి పరివాహక ప్రాంతం నూతనంగా 100 ఫీట్ల రోడ్డు వేస్తున్న ప్రాంతంలో సుమారు 50 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ స్థలంలో  ప్రజాసంఘల ఐక్య వేదిక పోరాటం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెవిపిఎస్ నాయకులు నగర మహేందర్ హాజరై మాట్లాడుతూ అంబర్ పేట్ నియోజకవర్గం లో అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్న పేదలకు మాత్రం జానేడు  జాగా ఇవ్వడం లేదని అనేక దఫాలుగా ఎమ్మార్వో ఆఫీసులో కలెక్టర్ ఆఫీసుల ముందు దరఖాస్తు చేసుకొని మొరపెట్టుకున్న ఇంతవరకు ప్రభుత్వం ఇల్లు కట్టించలేదని విమర్శించారు.

హైదరాబాదులో కాకుండా సిటీ ఔట్స్కట్స్ లో 80 వేల ఇండ్ల నిర్మాణం చేపట్టారు. నియోజవర్గానికి 4000 కేటాయిస్తున్నామని చెప్పినప్పటికీ ఈ సేవలో అప్లికేషన్ పెట్టుకున్న వారికి మూడు లక్షల 50 వేలకు ముందుకి పైగానే ఉన్నారని చెబుతున్న ప్రభుత్వం ఆ ఇల్లు కేటాయింపులో కార్యరూపం రావట్లేదు ముషరాంబాగ్ చౌరస్తా దగ్గరలో ప్రభుత్వ భూమి 50 ఎకరాలు పైన ఉందని దీని కబ్జాదారులు దర్జాగా కబ్జా చేస్తున్నారని ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహారిస్తూ  పేద ప్రజలు 60 గజాల స్థలంలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిద్దామని అనుకుంటే పోలీసు బందోబస్తు పెట్టి వారిపై కేసులు.పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ స్థలం 10ఏకరాల  వరకు ఉందని బతుకమ్మ కుంటలో కూడా ఆరు ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉందని ఇంకా ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి వెతికితే ప్రభుత్వ స్థలాలు అంబర్ పేట్ నియోజకవర్గంలో ఉంటుందని వీరందరికీ ఇక్కడే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో మేమే ఇక్కడ ముసలాం బాగ్ లో ఉన్న ఈ భూమిని సుమారుగా 5000 మంది ప్రజల్ని సమీకరించి ఈ ప్రాంతంలో గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంబర్ పేట్ నియోజకవర్గం లో నివాసం ఉంటున్న నిరుపేదలకి  డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అంబర్పేట జోన్ కన్వీనర్ జి.రాములు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బి.సుబ్బారావు, ఆవాజ్ జోన్ నాయకులు  జబ్బార్, రయిస్, గిరిజన సంఘం నగర కార్యదర్శి రఘునాయక్, డివైఎఫ్ఐ జోన్ కన్వీనర్ శ్రీనివాస్, ప్రజానాట్యమండలి నగర నాయకులు జనార్ధన్, మహిళా సంఘం నాయకులు రజిత, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

పాలకులు ఎడాపెడా అప్పులు చేసేస్తే ఏమౌతుంది?

Satyam NEWS

వైఎస్సార్సీపీ మంత్రులు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు

Bhavani

టీమ్ ఇండియా మహిళా జట్టుకు ఎంపికైన త్రిష

Murali Krishna

Leave a Comment