29.7 C
Hyderabad
May 2, 2024 06: 03 AM
Slider జాతీయం

అమెరికా బ్యాంకుల రుణం ముందే చెల్లించివేస్తున్న అదానీ

#gowtamadani

హిండెన్‌బర్గ్ దెబ్బకు విలవిల లాడుతున్న అదానీ గ్రూప్ తిరిగి తన ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. స్టాక్ మానిప్యులేషన్, పార్కింగ్ డబ్బు కోసం విదేశీ షెల్ సంస్థలను అదానీ గ్రూప్ ఉపయోగించుకుందని ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ జనవరి 24న ఒక నివేదికను బహిర్గతం చేసింది. ఆ నాటి నుంచి అదానీ గ్రూప్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. గత సంవత్సరం హోల్సిమ్ లిమిటెడ్ సిమెంట్ ఆస్తుల కొనుగోలుకు అదానీ గ్రూప్ అమెరికాకు చెందిన బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్, డ్యుయిష్ బ్యాంకుల సమూహం నుంచి 1.1 బిలియన్ల డాలర్ల రుణం తీసుకున్నది. ఈ రుణం రీషెడ్యూల్ చేసేందుకు ఇంతకాలం చర్చలు జరిపిన అదానీ గ్రూప్ ఇప్పుడు ఆ చర్చలను నిలిపివేసి 500 మిలియన్ల రుణాన్ని ముందస్తుగా చెల్లించాలని యోచిస్తోంది. ఇలా చేయడం ద్వారా మదుపుదారులలో విశ్వాసం నింపవచ్చునని అదానీ గ్రూప్ భావిస్తున్నది. మామూలుగా అయితే మార్చి 9నాటికి కొంత రుణం చెల్లించాలని ముందుగా చేసుకున్న ఒప్పందంలో ఉన్నది. అయితే దీన్ని మరింత ముందుకు జరపాలని ఇప్పటి వరకూ కోరిన అదానీ గ్రూప్ ఇప్పుడు ఆ ప్రతిపాదన విరమించుకుని ఒక నెల ముందే ఆ రుణభాగాన్ని చెల్లించేందుకు సిద్ధం అవుతున్నది.

Related posts

భద్రాచల రాముడికి ఎదుర్కోలు ఉత్సవం

Satyam NEWS

అలనాటి అందాల హీరోయిన్ ఎల్. విజయలక్ష్మి కి యన్టీఆర్ అవార్డ్

Bhavani

సారా అమ్మినందుకు మహిళకు ఏడాది జైలు శిక్ష

Satyam NEWS

Leave a Comment