30.7 C
Hyderabad
May 5, 2024 06: 03 AM
Slider వరంగల్

డాక్టర్లు కాబోతున్న చిన్న గ్రామానికి చెందిన పేద విద్యార్ధులు

#felicitation

ములుగు జిల్లా సర్వాపూర్ గ్రామానికి చెందిన అన్నా చెల్లెళ్లు ఎంబిబిఎస్ సీట్లు సాధించారు. దీంతో ఆ గ్రామం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడపాక రాజశేఖర్ వర్మ, కార్యదర్శి గైకడి రవి కుమార్ ఆధ్వర్యం లో వారికి సన్మానం జరిపారు. సర్వాపూర్ గ్రామానికి చెందిన జాజ నర్సింహులు, జయ కుమారుడు భరత్, కుమార్తె అంజలి ఎంబిబిఎస్ సీటు సాధించినందున ములుగు జిల్లా బీఎస్పీ ఆధ్వర్యంలో వారిని వారి తల్లిదండ్రులను వారికి విద్యా బోధన చేసిన టీచర్లను కూడా సన్మానించారు.

వారికి ప్రాథమిక విద్య బోధన చేసిన గురువు రాజు మాస్టర్ ను, తల్లితండ్రులను శాలువాతో సన్మానించారు. చదువు ద్వారానే సమాజం మారుతుంది అని ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి లు నరేష్ కుమార్, సతీశ్ అన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు డాక్టర్స్ కాబోతున్నారు అని కొనియాడారు. ఇది ఎంతో మంది కి ఆదర్శం కావాలి అన్నారు. ప్రతీ తల్లిదండ్రులు పిల్లల కల సాకారం కోసం, శ్రమించాలి అని అన్నారు. మెడిసిన్ సాధించిన ఈ ఇద్దరు ఉన్నత విద్యా వంతులకు బీఎస్పీ ఎల్లవేళల అండగా నిలుస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు గుందేబోయిన రవి గౌడ్ గారు, బీఎస్పీ మండల నాయకులు గొంది రవి కుమార్, ఉపసర్పంచ్ రాజు పాల్గొన్నారు.

Related posts

కోడెల మరో కథ: అద్దె కొట్టేయ్ రాజా

Satyam NEWS

ప్రతిభ కనబరిచిన మానస

Bhavani

విపత్కర పరిస్థితులలో కూడా సంక్షేమ పథకాలు ఆగవు

Satyam NEWS

Leave a Comment