32.7 C
Hyderabad
April 27, 2024 00: 46 AM
Slider నల్గొండ

స్వచ్ఛ సర్వేక్షన్ పై హుజూర్ నగర్ లో అవగాహన ర్యాలీ

#HujurnagarMunicipality

ప్రజలందరూ తడి,పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీకి  చెందిన చెత్తను సేకరించే వాహనాలకి అందజేయాలని,మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకం మానివేయాలని, ప్రజలందరూ ఇంటింటికి మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ర్యాలీ నిర్వహించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం స్వచ్ఛత ర్యాలీని నిర్వహించిన అనంతరం మున్సిపల్ ఇంచార్జ్ మేనేజర్ సతీష్,శానిటరీ ఇన్ స్పెక్టర్ జానకి మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణాన్ని చెత్త రహిత పట్టణంగా మార్చాలని, తాము చేసే ప్రయత్నానికి హుజూర్ నగర్ పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎటువంటి పరిస్థితుల్లో చెత్తను వీధుల్లో పడవేయవద్దని, పర్యావరణాన్ని కాపాడడానికి ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిరోధించాలని కోరారు.

తడి చెత్త నుంచి వర్మి కంపోస్టు తయారు చేసి మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చని అన్నారు. ఈకార్యక్రమంలో నాగిరెడ్డి, శేఖర్ రెడ్డి,సీతారాములు,జ్యోతి, సుశీల,శారద,పద్మ, మున్సిపాలిటీ ఉద్యోగులు,సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు,పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులు,తదితరులు పాల్గొన్నారు.

Related posts

అప్పాయింట్ మెంట్: ఎయిమ్స్ బోర్డు సభ్యుడుగా బండ ప్రకాష్

Satyam NEWS

గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఎలుక కలకలం

Bhavani

ఎటెన్షన్: ఎన్నికల కమిషనర్ కు కేంద్ర భద్రత కల్పించాలి

Satyam NEWS

Leave a Comment