38.2 C
Hyderabad
April 29, 2024 12: 00 PM
Slider ఆంధ్రప్రదేశ్

బోస్టన్ కంపెనీపై విజయసాయిరెడ్డి అల్లుడి ఫ్రెండ్ ది

రాజధానిపై సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చిన బోస్టన్ కన్సల్ టెన్సీ గ్రూప్ వైసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి ఫ్రండ్ దని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. బోస్టన్ కంపెనీ పోర్చుగల్ లో అవకతవకలకు పాల్పడిందని ఆయన అన్నారు.

గూగుల్ లో ఖైదీ నెంబర్ 6093 అని కోడితే జగన్ ఫోటో వచ్చి పక్కన ఆంధ్రప్రదేశ్ 17వ ముఖ్యమంత్రి జగన్ అని వస్తుందని చంద్రబాబునాయుడు అన్నారు. వీళ్లు ఇప్పుడు రాజధాని మారుస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే మాత్రం ఇప్పుడు భయపడే పరిస్థితి తెచ్చారని వ్యాఖ్యానించారు. అమరావతి ఒక పుణ్యక్షేత్రం… ఎవ్వరైనా ఈ ప్రాంతానికి చెడు చేస్తే వారే నాశనం అయిపోతారని చంద్రబాబు అన్నారు.

పవన్ కల్యాణ్ పర్యటనకు ఆంక్షలు విదిస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు నేనూ ఆంక్షలు పెట్టి ఉంటే జగన్ పాదయాత్ర చేసే వారా అని ఆయన అన్నారు. ప్రజలే రక్షణగా ఉండి పవన్ కల్యాణ్ ని తీసుకెళ్లారని చంద్రబాబు చెప్పారు. ఇది రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది రాజధాని… రాష్ట్రంలో ఉండే రైతులు మొత్తం వచ్చి పోరాటం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. నేను చెట్టు కింద కూర్చోని అభివృద్ధి చేశా… జగన్ ఏసీలో కూర్చుని కబుర్లు చెబుతున్నారని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏసీతో కూడిన సెక్రటేరియట్, రాజ్ భవన్, డీజీపీ ఆఫీస్, ఏపీ ఐఐసీ కార్యాలయం, హైకోర్టు,  నిర్మించానని చంద్రబాబు తెలిపారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం జరిగిందని, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్ , బెంగుళూరు వెళ్లే పరిస్థితిని మళ్లీ  ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన అన్నారు.

నూతన సంవత్సర జరుపుకోకుండా బావి తరాలకు త్యాగం చేద్దాం. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి నందుకు రైతులు వారి చెప్పులతో వాళ్లు కొట్టుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఒక కులం కోసం చేశానా అని ఆయన ప్రశ్నించారు.

Related posts

తిరుపతి ఎంపీ స్థానం ఉప ఎన్నికపై సీఎం భేటీ

Sub Editor

విత్తనాలు సకాలంలో అందించే బాధ్యత అధికారులదే

Bhavani

Chargesheet: కొందరి కోసమే పని చేస్తున్న మోదీ

Satyam NEWS

Leave a Comment