39.2 C
Hyderabad
May 3, 2024 12: 42 PM
Slider ముఖ్యంశాలు

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యల మీద మండిపడ్డ బీఆర్‌ఎస్‌

#Kavitha

వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు.

రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఆందోళనలు చేపట్టారు. ఊరూరా రేవంత్ రెడ్డి‌, కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రేవంత్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధ వద్ద నిర్వహించిన ధర్నాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన నిరసనల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. బోయిన్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన చేశారు.

Related posts

నో సింపతీ: అంకిత భావం అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

Satyam NEWS

క్యాన్సర్ వ్యాధి బాధితుడికి ఆర్థిక సహాయం అందజేసిన కోరాడ

Satyam NEWS

నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు లండన్ రెడీ

Satyam NEWS

Leave a Comment