28.7 C
Hyderabad
May 5, 2024 23: 15 PM
Slider ప్రత్యేకం

బిసిలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

#puvvada2

బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్త రామదాసు కళాక్షేత్రం నందు బీసీ బంధు పథకం ద్వారా మంజూరైన 300 మంది లబ్దిదారులకు రూ .3కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులను మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు. అంతరించి పోతున్న కులవృత్తులకు జీవం పోయాలనే ముఖ్య ఉద్దేశంతో కేసీఆర్‌ ప్రతి కుటుంబానికి వంద శాతం సబ్సిడీతో లక్ష రూపాయల సాయం అందిచెందుకు బీసీ బంధు పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు.

కులవృత్తులకు జీవం పోయడంతో పాటుగా ప్రతి కార్మికుడు కార్మికుడిగా మిగిలి పోకుండా యజమాని కావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నిరుపేద కుటుంబాలకు బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నేడు అందిస్తున్నదని అన్నారు. కుల వృత్తులకు ప్రభుత్వం లక్ష రూపాయలు అందచేస్తుంది రుణం కాదని ఇది గ్రాంట్ అని వివరించారు. తిరిగి చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. తమ వ్యాపార పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి సహాయ పడాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు అందిస్తున్నదని  దీన్ని సద్వినియోగించుకుని బిసిలు ఆర్దికంగా ఉన్నత స్థితికి రావాలని ఆకాంక్షించారు.

బిసి బందు పథకం ద్వారా అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం ప్రతీ నెల కొనసాగే నిరంతర ప్రక్రియ అని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, గత ప్రభుత్వాలు కులాలు, మతాల పేరిట ఓట్ల రాజకీయం చేశాయే తప్పితే కుల వృత్తులను కాపాడే ప్రయత్నం చేయలేదని అన్నారు. నేడు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ గౌరవంగా జీవించాలనే ఉదేశ్యంతో కులవృత్తులను బలోపేతం చేస్తున్న మహనీయుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.

కులవృత్తులు, చేతివృత్తులకు ఆపన్న హస్తం అందించి ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆరేనని అన్నారు. మన కుటుంబాన్ని ఆదుకుంటున్న కేసీఅర్ కి అండగా నిలవాలని, మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వేస్తే ఈ పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి మీకు అందిస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ను మళ్ళీ గెలిపించాలని కోరారు.

Related posts

చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బ

Satyam NEWS

ప్రియా! నీవెక్కడ??!

Satyam NEWS

హోల్డాన్: వైసీపీ లీడర్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు

Satyam NEWS

Leave a Comment