39.2 C
Hyderabad
May 3, 2024 11: 59 AM
Slider చిత్తూరు

చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బ

#chandrababu

చిత్తూరు జిల్లా తంబళ్ల పల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అదే పార్టీకి చెందిన తంబళ్ల పల్లి కిచెందిన వైసిపి నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి, ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.

మద్దిరెడ్డి భార్య తంబళ్ల పల్లి వైసిపి జడ్పిటిసిగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అరాచకాలు, అవినీతిని మద్దిరెడ్డి కొండ్రెడ్డి గట్టిగా ప్రశ్నించారు. దీంతో కొండ్రెడ్డిపై అధికార పార్టీనేతలు కేసులు పెట్టి వేధించారు. వైసిపి అరాచక పాలనను వ్యతిరేకిస్తూ కొండ్రెడ్డి తెలుగు దేశం తీర్థం పుచ్చుకున్నారు.

పుంగనూరులో పెద్దిరెడ్డికి, తంబళ్ల పల్లిలో ద్వారకానాథరెడ్డికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా పని చెయ్యాలని చంద్రబాబు సూచించారు. ఇప్పుడు దౌర్జన్యాలతో రాజ్యం ఏలుతున్న వారికి అధికారంలోకి వచ్చిన తరవాత అంతే గట్టిగా సమాధానం చెపుతామని చంద్రబాబు అన్నారు.

చిత్తూరు జిల్లాలో 14 సీట్లూ గెలిచేలా పార్టీని సిద్దం చెయ్యడంపై ఫోకస్ పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, శ్రీనివాసులు రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శంకర్ యాదవ్, చల్లా బాబు రెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్, పర్వీన్ తాజ్ పాల్గొన్నారు.

Related posts

ప్రభాస్ మద్దతు కు కేటిఆర్ కృతజ్ఞతలు

Satyam NEWS

తారక రత్నకు నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ

Murali Krishna

బీజేపీ…. బీఆర్ఎస్ మధ్యలో అన్నాచెల్లీ గేమ్

Bhavani

Leave a Comment