28.7 C
Hyderabad
May 6, 2024 08: 26 AM
Slider ప్రత్యేకం

అభివృద్ధి, సంక్షేమాలపై విస్తృత ప్రచారం కల్పించాలి

#puvvada

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలను గడపగడపకు తీసుకెళ్లే బాధ్యత బీఆరెస్ పార్టీ కార్యకర్తలపై ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. బిఅర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఖమ్మం నగరంలోని మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఖమ్మం కార్పొరేషన్ లోని ఖానాపూర్ హవేలి డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

తొలుత చీమలపాడు ఘటనలో మృతి చెందడం పట్ల వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు పాటు మౌనం పాటించి వారికి నివాళులు అర్పించారు. 60లక్షల సభ్యత్వం ఉన్న అతి పెద్ద పార్టీ బి ఆర్ ఎస్ అని, రాష్ట్రంలో గానీ కర్ణాటక, మహారాష్ట్ర లో మనను ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు.కార్యకర్తల సంక్షేమం కోసం పాత కొత్త అనే తేడా లేకుండా కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని.. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు.

కార్యకర్త పార్టీకి వెన్నెముక లాంటి వాడని, వారి సంక్షేమం పార్టీ బాధ్యత అని అన్నారు.పార్టీ అభివృద్ధి కోసం కళ్ళల్లో ఒత్తులు వేసి కాపాడుకుంటున్న వారికి నేను అండగా ఉంటానని స్పష్టం చేశారు.మనం అధికారంలో ఉన్నాం కాబట్టి సహజంగానే ఉరుకుల పరుగులుగా మన రోజు గడిచిపోతుంది… అలాంటి సందర్భంలో నాయకులు, కార్యకర్తలు ప్రజలతో సంబంధాలు కోల్పోకుండా మన పని మనం చేసుకుంటూనే ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించాలని అందుకే పార్టీ అధినేత ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాల ద్వారా సూచించారు.

ఖమ్మంలో ఒకాయన మన పార్టీని భూ స్థాపితం చేస్తామని మంగమ్మ శపదాలు చేస్తున్నారని, అలాంటి శపధాలు చాలా చూశామని, కేసీఆర్  ముందు ఇలాంటి అనేక మంగమ్మ శపధాలు భూస్థాపితం అయ్యాయని అన్నారు.ప్రజలు కదా నన్ను అసెంబ్లీకి పంపేది.. ఈ అభివృద్ధిని చూసి కదా ప్రజలు మనలను అసెంబ్లీ కి పంపేది.మనకేదో కడుపు నొప్పి కలిగింది అని బి ఆర్ ఎస్ పై విమర్శలు చేయడం సరైనది కాదన్నారు.

నువ్వు అసెంబ్లీ కి పంపేది ఎంటి… ఆ అధికారం ప్రజలకు కదా ఉంది.. నగరంలో 4వేల మందికి ఉన్న చోటే ఇళ్ళకు జిఓ 58, 59 ద్వారా ఇళ్ళకు శాశ్వత పట్టాల మంజూరు, సిఎంఆర్ ఫ్ ద్వారా రూ.20 కోట్లు, 30వేల మంది పెన్షన్లు, 30 వేల మంది తల్లులకు కేసీఆర్ కీట్స్, 8వేల మందికి కళ్యాణ లక్ష్మి, షాదిముభారక్ ద్వారా 76 కోట్లు పంపిణీ, దసరాకు బతుకమ్మ చీరలు, రంజాన్ కు తోఫా లు, క్రిస్మస్ కు కానుకలు ఇలా అనేక సంక్షేమ పథకాలు అందుకుని, మన అభివృద్ధిని చూసిన ప్రజలే మనలను అసెంబ్లీ కి పంపిస్తానని తెలుసుకోవాలన్నారు.

ప్రజలకు మంచి పని చేసే నాయకుడు తీపి గుళికలు లాగా ఉంటారని, కేవలం అప్పుడప్పుడు కనిపించే వాళ్ళను చేదు గుళికలు లాగానే చూస్తారని గుర్తు చేశారు.కరోనా సమయంలో చెప్పులు అరిగేలా అన్ని జోన్ లకు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చోటకు కూడా వెళ్లి వాళ్ళను పరామర్శించి, వారికి నిత్యావసర సరుకులు, ట్యాంకర్ల ద్వారా ఆక్సీజన్ అందుబాటులో ఉంచి, అవసరం అయినన్ని బెడ్లు ఉంచి మన బిడ్డలను కాపాడుకున్నమని వారే నన్ను అసెంబ్లీకి పంపుతారు ధీమా వ్యక్తం చేశారు.ఎక్కడి నుండో వచ్చి ఖమ్మంను చూసి ఇది ఖమ్మమేనా అని కొనియాడినందుకేనా మాపై మీకు కళ్ళు కుట్టినయా అని ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్దిని చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణకు నయాపైసా ఇవ్వని వారు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మాయ మాటలతో తెలంగాణను ఆగం పట్టియ్యాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ను కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.చీమలపాడు లో జరిగిన ఘటన అత్యంత భాదాకరమన్నరు. వారి కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు. వారికి ప్రకటించిన రూ.10 లక్షలు అతి త్వరలోనే వారి కుటుంబాలకు అందజేసి వారిని ఆదుకుంటామని స్పష్టం చేశారు.అనంతరం బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో బాగంగా సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలకు మంత్రి పువ్వాడ స్వయంగా వడ్డించిన అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

Related posts

సీఎం చేతుల మీదుగా మెడికల్ కళాశాల ప్రారంభం

Bhavani

ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

వానలు రాగానే అన్ని చెరువులు నింపాలి

Satyam NEWS

Leave a Comment